Today Astrology: ఓ రాశివారు పిల్లల పనులపై ఓ కన్నేసి ఉంచాలి

First Published Jun 20, 2024, 5:30 AM IST

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-చిన్న విషయంలో బంధుమిత్రులతో వివాదాలు వస్తాయి.  వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగవు. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొదలుపెట్టిన పనుల్లో అడుగడుగునా ఆటంకాలే ఎదురువుతాయి. ప్రయాణాల వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఉద్యోగులు పనిభారంతో ఒత్తిడికి లోనవుతారు. 
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే మాటలు పడాల్సి వస్తుంది.  ఇంటా, బయట వాతావరణం మీకు చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఎంత కష్టపడినా తగిన ఫలితాన్ని మాత్రం పొందలేరు. ఉద్యోగుల పని బాధ్యత పెరుగుతుంది. పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. 

Latest Videos


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- వ్యాపారుల మంచి లాభాలను చూస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఒక ట్రిప్ కు వెళతారు. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ పనైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రారంభించాలి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి విముక్తి దొరుకుతుంది. 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఓ విషయంలో బంధువులతో గొడవలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారులు ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువ అవుతాయి.  ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. 
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-ఒకరి జోక్యంతో సోదరులతో ఉన్న స్థిరాస్థి వివాదం తొలగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మిత్రులతో ఒక విషయంలో గొడవ పడతారు. కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకున్న విధంగా సాగవు. ఉద్యోగులకు పనిభారంతో విశ్రాంతి దొరకదు. .

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-దైవ దర్శనం చేసుకోవడంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమయానికే మీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఈ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను అర్జిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. 
 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఒక శుభకార్యానికి కుటుంబంతో వెళతారు. వ్యాపారులు మంచి పెట్టుబడులను అందుకుంటారు. వృత్తి ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు మీకు లాభాదాయకంగా ఉంటాయి. 
 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు ఎంత కష్టపడ్డా ముందకు మాత్రం వెళ్లవు. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. మీరు ఊహించని విధంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలహాలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. 
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఉద్యోగులు ప్రమోషన్స్ లో భాగంగా వేరే ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. దైవచింతన మీలో మంచి మార్పును తెస్తుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. వృత్తి వ్యాపారాలు అనుకున్నట్టు సాగవు. అనుకోకుండా ప్రయాణాలను క్యాన్సల్ చేస్తారు. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-నూతన వాహనం కొనే సూచనలు ఉన్నాయి. భూ క్రయ, విక్రయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మీ ఆలోచనలను కార్యరూపం దాల్చుతారు. వ్యాపారాలు ఆశించిన లాభాలను పొందుతారు. 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం ఎక్కువగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారులకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

click me!