ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా..? ఏ రోజు ఇవ్వడం మంచిదో తెలుసా?

First Published | Jun 19, 2024, 2:20 PM IST

ఏ రోజులో పడితే ఆ రోజులో ఎవరికైనా డబ్బులు ఇస్తే.. అవి మళ్లీ.. మన చేతికి తిరిగి వస్తాయి అనే గ్యారెంటీ ఉండదు. అందుకే.. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఏ వారం ఇవ్వాలో తెలుసుకోవడం ఉత్తమం. మనం ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం..

జోతిష్యశాస్త్రంలో ప్రతిరోజుకీ ఏదో ఒక విశేషం ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు  మంచి రోజు ఏంటి..? మంచి సమయం ఏంటి అని చూసుకోని చేయాలి అని  మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి. ఎందుకంటే... ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఏ రోజులో పడితే ఆ రోజులో ఎవరికైనా డబ్బులు ఇస్తే.. అవి మళ్లీ.. మన చేతికి తిరిగి వస్తాయి అనే గ్యారెంటీ ఉండదు. అందుకే.. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఏ వారం ఇవ్వాలో తెలుసుకోవడం ఉత్తమం. మనం ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం..

Indian Money


మెర్య్యూరీని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. ఈ మెర్క్యరీ సంపదకు, వ్యాపారాలకు చిహ్నంగా భావిస్తారు. ఇక మెర్క్యూరీని.. బుధవారానికి సూచికగా చెబుతూ ఉంటారు. అందుకే బుధవారం రోజున మెర్క్యూరీని పూజించడం వల్ల.. మన సంపాదన పెరుగుతుందని నమ్ముతారట.  డబ్బు సంపాదించడానికీ, ఆదా చేయడానికీ ఇది సహాయపడుతుంది. బుధవారం చేసే పనిలో విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు అయినా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. సానుకూల ఫలితాలను ఇస్తాయి.  ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Latest Videos



బుధవారంతో పాటు.. గురువారం కూడా మనం డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేసుకోవచ్చు. గురువారాన్ని బృహస్పతి గా భావిస్తారు. ఈ రోజుని  జ్ఞానం, శ్రేయస్సు , అదృష్టానికి చిహ్నం గా భావిస్తారు.  గురువారం బృహస్పతి భగవంతుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున ఆయనను పూజించడం వల్ల అభివృద్ధి కలుగుతాయి. అలాగే ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మీరు గురువారం డబ్బు లావాదేవీలు చేస్తుంటే, ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది.

ఇక సోమవారం రోజుని శివుడికి అంకితం చేశారు.  అందుకే.. ఈ సోమవారం రోజున కూడా మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా చేసుకోవచ్చు.. దీని వల్ల సంపద పెరిగే అవకాశం ఉంది, అయితే సోమవారం సాయంత్రం డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఇది నష్టానికి దారి తీస్తుంది. వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
 


అంతేకాకుండా.. లావాదేవీలు చేసే టప్పుడు.. ఉదయం పూటను ఎంచుకోవాలి.. ఉదయం పూట శుభప్రదం గా పరిగణిస్తారు. సాయంత్రం వేళల్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకే... ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో.. ఉదయం పూట ఇవ్వడం బెటర్. సాయంత్రం ఇవ్వకపోవడమే మంచిది.

click me!