సాయంత్రం గోర్లను ఎందుకు కట్ చేయొద్దని చెప్తారో తెలుసా?

First Published | Jun 19, 2024, 2:05 PM IST

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయకూడదని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది. ఇలాంటి వాటిలో గోర్లను కట్ చేయడం కూడా ఉంది. అవును సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేస్తే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. 

మన మతగ్రంథాల్లో మనం చేయాల్సిన, చేయకూడని పనుల గురించి వివరించబడి ఉంది. వీటిని పాటిస్తేనే అన్నీ సవ్యంగా జరుగుతాయని కొంతమంది నమ్ముతారు. వీటిని పాటించకపోతే మనపై చెడు ప్రభావం పడుతుందని కూడా నమ్ముతారు. అయితే సూర్యాస్తమయం తర్వాత మనం కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యం, శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ఒకటి గోర్లు కట్ చేయకూడదు. సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత గోర్లను పొరపాటున కూడా కట్ చేయకూడదు. 


సూర్యాస్తమయం తర్వాత గోర్లు చేయకుండా ఉండే ఆచారాన్ని ఎన్నో ఏండ్లుగా పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆచారం జ్యోతిషశాస్త్రంతో సహా అనేక సమాజాలలో కనిపిస్తుంది. దీన్ని ఒక ఆచారంగానే భావించినా దీనివెనుక ఎన్నో జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


వైదిక జ్యోతిషశాస్త్రంలో.. రాహు కాలం అశుభ కాలం. ఈ సమయంలో ఎలాంటి ముఖ్యమైన లేదా వేడుకలు, శుభకార్యాలు చేయకూడదు. ఈ సమయంలో మోసం, అవరోధాలతో సంబంధం ఉన్న నీడ గ్రహం రాహువు చెడు ప్రభావం ప్రబలుతుందని నమ్ముతారు.రాహుకాలం సాధారణంగా ప్రతిరోజూ ఒకటిన్నర గంటల పాటు ఉంటుంది. అలాగే దీని స్థానం, గ్రహ స్థానాలను బట్టి ఇది మారుతుంది. అందుకే రాహుకాలంలో గోర్లను కట్ చేయకూడదని నమ్ముతారు. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శుభ ఫలితాలకు ఆటంకం కలిగిస్తుంది.
 

జ్యోతిష్య కారణాలు

జ్యోతిష్యుల ప్రకారం.. రాత్రి సమయంలో ఉత్పన్నమయ్యే ఆధ్యాత్మిక, విశ్వశక్తి కారణంగా సూర్యాస్తమయం తర్వాత గోళ్లును కట్ చేయకూడదు. వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రోజులో ప్రతి గంటను ఒక నిర్దిష్ట గ్రహం పరిపాలిస్తుంది. రాత్రిపూట శని గ్రహాన్ని పాలక గ్రహంగా భావిస్తారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత రాహువుతో పాటు శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శని క్రమశిక్షణ, కర్మ, వివేకం నియమంతో సంబంధం కలిగి ఉంటాడు. శని ప్రభావం సమయంలో.. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయడం వల్ల ప్రతికూల కర్మ ఫలితాలను పొందుతారు. దీనివల్ల మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలుగుతుంది. 

డబ్బు నష్టం 

సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేసే మీరు డబ్బు నష్టపోవాల్సి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతే కాదు దీనివల్ల మీరు జీవితంలో ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి కూడా రావొచ్చు. సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయడం వల్ల శనిగ్రహానికి కోపం వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీరు ఎన్నో ఇతర నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. 
 

సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయడం వల్ల డబ్బు నష్టంతో పాటుగా ఇతర ఆర్థిక పరిణామాలు కూడా సంభవిస్తాయి. దీనివల్ల పెట్టుబడుల్లో నష్టం, రుణాలు చెల్లించడంలో ఇబ్బందులు, క్రమరహిత ఆదాయం వంటి వివిధ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. 

Latest Videos

click me!