
మేషం:
ఈరోజు మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఏదైనా పొదుపు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఆ పని వెంటనే చేయండి. ఇది మీకు లాభాదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రణాళికలను సోదరులతో కానీ సన్నిహితులతో కానీ చర్చించకండి. బద్ధకం వల్ల ఏ పని చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నోటి నుంచే వచ్చే కొన్ని చెడ్డ మాటలు ఇతరులను బాధపెడతాయి. పని రంగంలో సహచరులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. పని భారం ఉన్నప్పటికీ మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
వృషభం:
ఆర్థిక కార్యకలాపాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మతపరమైన లేదా ఆధ్యాత్మిక రంగంలో మీ ఆసక్తి పెరుగుతుంది. దీంతో మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రణాళిక ప్రకారం అన్ని పనులను పూర్తి చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్నిసార్లు ద్రోహం జరగొచ్చు. స్నేహితులతో మీ సమయాన్ని వృథా చేయకండి. మీ శక్తిని మంచి పనులకు ఉపయోగించండి. ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఇంటి ఏర్పాటు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావొచ్చు.
మిథునం:
ఏదైనా పాలసీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టైతే వెంటనే మొదలుపెట్టండి. పరిస్థితి మీకు అనుకూలంగా ఉంది. ఇతరులు మీకు సహాయపడతారని ఆశించండి. మీ మనసులోని మాటను వినండి. మీరే మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆదాయంతో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీ కుటుంబ విషయంలో లేదా వ్యాపార విషయంలో బయటి వ్యక్తులెవరూ జోక్యం చేసుకోనివ్వకండి. వ్యాపార స్థలంలో చేసిన కృషి వల్ల సరైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం:
ఈ రోజు మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు. కొంతకాలంగా ఉన్న ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు.పిల్లల సమస్యలను పరిష్కరిస్తారు. దీంతో పిల్లలకు భద్రతా భావం కలుగుతుంది. ఇంట్లో ఒక వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. వ్యాపార కార్యకలాపాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. మీ పట్ల భాగస్వామి భావోద్వేగ మద్దతు మీ సామర్థ్యానికి కొత్త దిశను ఇస్తుంది. సీజనల్ సమస్యలు వస్తాయి.
సింహ రాశి:
ఫైనాన్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ ప్లాన్‌లలో దేనినైనా ప్రారంభించడం వల్ల మనస్సుకు ఆనందం కలుగుతుంది. అలాగే మీకు ఇష్టమైన పనులను చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. మీ భావోద్వేగ స్వభావాన్ని నియంత్రించండి. లేకపోతే ఎవరైనా మీ భావోద్వేగం, దాతృత్వాన్ని తప్పుగా ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో పని రంగంలో పనులను చాలా వరకు మీరే పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది.
కన్య:
ఈరోజు మీ సమర్థతతో ఎన్నో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీ ఆలోచనలను పూర్తిగా ఆచరణాత్మకంగా ఉంచండి. స్టాక్ మార్కెట్, రిస్క్ సంబంధిత కార్యకలాపాలల్లో లాభాలు పొందుతారు. పుకార్లను ఏమాత్రం పట్టించుకోవద్దు. కొద్దిమంది మాత్రమే అసూయతో మీ కష్టాలను పెంచుతారు. పొరుగువారితో వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ సమయం వెచ్చిస్తారు.
తుల:
ఈ సమయంలో గ్రహాల స్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. మిమ్మల్ని మీరు బాగా నమ్ముతారు. ఒక ముఖ్యమైన పని కోసం ప్రణాళికలను రూపొందిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్వార్థ భావన స్నేహితులతో సంబంధాన్ని పాడుచేస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ మీరు మీ ప్రవర్తనను కూడా మార్చుకుంటారు. ప్రస్తుతం ఉద్యోగంలో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి.
వృశ్చికం:
విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. శక్తిని, సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఈరోజు మీరు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి కొన్ని పనులు హఠాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేయకండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. పబ్లిక్ రిలేషన్స్ మీ వ్యాపారం కోసం కొత్త వనరులను తెరవగలవు. కుటుంబ వాతావరణం ఆనందంగా సాగుతుంది.
ధనస్సు:
కొంతకాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కొన్నిసార్లు మీ అనుమానాస్పద కార్యకలాపం ఓ సమస్యకు కారణమవుతుంది. మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి. భావోద్వేగాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. వ్యాపార స్థలంలో ఉద్యోగులతో వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తలు తమ తమ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఒకరికొకరు సమయం కేటాయించలేరు. కొన్నిసార్లు అధిక పని భారం కారణంగా చిరాకు, అలసట కలుగుతాయి.
మకరం:
ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఆదాయ మార్గాలు బలపడతాయి. బంధువులు ఇంటికి రావొచ్చు. సోమరితనం దరిచేరనివ్వకండి. కొన్ని విషయాల్లో బంధువులతో వివాదాలు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. వ్యాపార కార్యకలాపాలలో అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం అవసరం. జీవిత భాగస్వామి మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం:
ఈరోజు ఇంట్లో కొన్ని పునర్నిర్మాణ పనులను చేపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు డబ్బులపై శ్రద్ధ వహించండి. ప్రయాణం మీకు లాభాదాయకంగా ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల విజయం జారిపోతుంది. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి. ఈ సమయంలో ముఖ్యమైనదాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు పని రంగంలో మరింత బిజీ ఉంటుంది
మీనం:
దైవ దర్శనం చేసుకుంటారు. ఇది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. పిల్లల సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఇంటి పెద్దల పట్ల గౌరవంగా ఉండండి. కొన్నిసార్లు మీ మితిమీరిన జోక్యం కారణంగా ఇంటి వాతావరణం చెడిపోతుంది. మీ ప్రవర్తనను మితంగా ఉంచండి. సోదరులతో ఏదో విషయంలో వాగ్వాదం ఉంటుంది. ప్రస్తుత వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారు.