Today Horoscope: ఓ రాశివారు శుభవార్త వింటారు

First Published | Aug 17, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది... వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి కలిసి వస్తుంది..? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి..? ఈ రోజు రాశిఫలాల్లో మనం తెలుసుకుందాం.

telugu astrology

మేషం:

ఈ రోజు నిలిచిపోయిన ప్రభుత్వ లేదా వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. దీంతో మీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లలకు చదువు లేదా వృత్తికి సంబంధించిన సమస్యలు ఉంటాయి.  అకస్మాత్తుగా ఖర్చు వస్తుది. తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సామాజిక కార్యకలాపాల్లో ప్రతికూల పనులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
 

telugu astrology


వృషభం:

ఒకరి జోక్యంతో సమస్యను పరిష్కరించుకుంటారు. విభేదాలు, అపార్థాలు తొలగిపోతాయి. వృత్తి విద్యార్థులు విజయం సాధిస్తారు. ఒక పనిలో ఆటంకం కలుగుతుంది.దీంతో స్నేహితుడిపై అనుమానం కలుగుతుంది. తెలియని వారితో పరిచయాలు పెట్టుకోరాదు. మీ కుటుంబ విషయంలో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వకండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతింటుంది. 


telugu astrology


మిథునం:

కుటుంబ సభ్యులతో కొంత సమయం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఒక సమస్య గురించి చర్చిస్తారు. అన్నదమ్ములతో ఉన్న వివాదం ఒకరి జోక్యంతో పరిష్కరించబడుతుంది. చాలా విషయాల్లో ఓర్పు, సహనం అవసరం. కోపం,  తొందరపాటు పరిస్థితులను మరింత దిగజార్చుతాయి. వ్యాపారంలో అనుకోని సమస్యలు వస్తాయి. ఇల్లు-కుటుంబం, వ్యాపారం మధ్య సరైన సామరస్యం ఉంటుంది. అలసట, ఒత్తిడి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. 

telugu astrology

కర్కాటకం:

పిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన పనిచేస్తారు. ఇంట్లో వివాహం కారణంగా  పండుగ వాతావరణం ఉంటుంది.  వ్యక్తిగత పనులపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మంచి విజయాన్ని సాధిస్తారు. డబ్బుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. అలాగే అనవసర ఖర్చులను తగ్గించుకోండి. విద్యార్థులు, యువత తమ కెరీర్‌కు సంబంధించిన పనులపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు బాగా కష్టపడి పనిచేయాలి. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు తొలగిపోతాయి.
 

telugu astrology


సింహ రాశి

గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. యువత విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వ్యాపార తిరోగమనం, ఆర్థిక మాంద్యం కారణంగా కుటుంబ సభ్యులు ఖర్చులను తగ్గించుకోవాల్సి  ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి అప్పులు చేయకండి. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ​​ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
 

telugu astrology

కన్య:

కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఇది అనుకూలమైన సమయం.  మీ కార్యకలాపాలను గోప్యంగా ఉంచడం మంచిది. డబ్బు విషయంలో బంధువులతో వివాదాలు రావొచ్చు. వ్యాపారానికి సంబంధించి మీరు ఏ పనైనా చేస్తే దాని ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  ప్రతికూల కార్యకలాపాలకు దూరంగా ఉండండి. 
 

telugu astrology

తుల:

ఒక ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. దీన్ని వెంటనే అమలు చేయడం సముచితం. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సమయం గడిచిపోతుంది. ఏదైనా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ నిర్ణయానికి ప్రాధాన్యతనివ్వండి. తెలియని వారిని నమ్మకండి.  రుణంగా తీసుకున్న డబ్బు ఈరోజు తిరిగి వస్తుంది. 
 

telugu astrology

వృశ్చికం:

తప్పుడు కార్యకలాపాలపై దృష్టి పెట్టకుండా మీ వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక సమస్యలు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏదైనా పని చేసే ముందు దాని సానుకూల, ప్రతికూలతల గురించి  ఆలోచించండి. భూమి కొనుగోలులో ఎక్కువ ఆశించకండి. మితిమీరిన కోరికలు హాని కలిగిస్తాయి. కోపం మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. వ్యాపారులు మంచి ప్రణాళికలు అమలుచేయాలి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ రెగ్యులర్ చెకప్‌లు అవసరం. 
 

telugu astrology

ధనుస్సు:

ఈ రోజు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. సోమరితనం దరిచేరనివ్వకండి. కొన్నిసార్లు మీ అనుమానాస్పద స్వభావం మీకు, ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి సమయానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోండి. మీ ప్రణాళికలు, కార్యకలాపాలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు కూడా ప్రారంభమవుతాయి. 
 

telugu astrology

మకరం:

దగ్గరి బంధువుతో ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. మీ తెలివితేటలను మెచ్చుకుంటారు. ఈ రోజు శుభవార్త వింటారు. కొంతమంది వ్యక్తులు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి వారితో మాట్లాడకండి. పని, కుటుంబ బాధ్యతల మధ్య సామరస్యాన్ని కొనసాగించడం అవసరం. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో ఒకరికొకరు సామరస్యం ఉంటుంది. ఇంటి ఏర్పాటు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావొచ్చు. 
 

telugu astrology

కుంభ రాశి:

కుటుంబంతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమయం ఆనందంగా గడిచిపోతుంది. మీరు తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రశంసించబడుతుంది. ఆర్థిక కోణం నుంచి ప్రత్యేకంగా సానుకూల ఫలితం ఉండదు. దీని కారణంగా చికాకు, నిరాశ భావన కలుగుతుంది. బంధువుల నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశించొద్దు. మీరు వ్యాపారంలో అధునాతన సాంకేతికతకు సంబంధించిన పథకాల గురించి తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య వచ్చినా ఒకరి ద్వారా ఒకరు పరిష్కారం కనుగొనగలుగుతారు. 
 

telugu astrology

మీనం:

ఇంటి పనుల్లో పూర్తి సమయాన్ని గడుపుతారు. ఇష్టమైన వారికి మీ మనసులోని మాటలను చెప్పండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ సమస్యలు పరిష్కరించబడతాయి. పొరుగువారితో ఏదో ఒక విషయంలో గొడవలు రావొచ్చు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో సమస్య తలెత్తుతుంది.చ్చు. భార్యాభర్తలు ఒకరికొకరు సామరస్యం ద్వారా సరైన ఏర్పాటు చేస్తారు.
 

Latest Videos

click me!