చనిపోయిన వాళ్ల దుస్తులు.. వేరే వాళ్లు వేసుకంటే ఏమౌతుంది..?

First Published | May 16, 2024, 10:34 AM IST

 అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు.

చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. అవన్నీ దైవ నిర్ణయం. మనకు ఎంతో ఇష్టమైన వారు చావు రూపంలో మనకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే.. మనం అమితంగా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడు బాధగా ఉంటుంది. అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు. అసలు ఎవరివైనా చనిపోయిన వాళ్లవి దుస్తులు వేసుకుంటే ఏమౌతుంది..? జోతిష్యశాస్త్రం, గరుడ పురాణం  దీని గురించి ఏం చెబుతోంది..?

గరుడ పురాణం ప్రకారం మాత్రం... చనిపోయిన వ్యక్తులు మాత్రం పొరపాటున కూడా వేరే వాళ్లు ధరించకూడదట. ఎందుకంటే.. మరణం తర్వాత కూడా.. వారి వస్తువులపై ఆత్మ ముడిపడి ఉంటుందట. ఆ దుస్తులు మనం ధరించడం వల్ల.. మీ పట్ల ఆత్మ ఆకర్షణ పెరుగుతుంది. వారిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గి... నెగిటివ్ ఎనర్జీ పెరగడం మొదలౌతుందట.


నిజానికి మృతుడి ఆత్మ తన కుటుంబాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడదు. వారి చుట్టూనే తిరగడానికి ఇష్టపడుతుందట.  తన కుటుంబంతో కలిసి జీవించే అవకాశాన్ని పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మరణించిన వారి వస్తువులను మన దగ్గర ఉంచుకోవడం ద్వారా, ఆత్మ మనతో ముడిపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మరణించినవారి ఆత్మ మళ్లీ ఇంటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండదు. దాని వల్ల ఆ దుస్తులు వేసుకున్నవారికి సమస్యలు రావడం మొదలౌతాయట.

అంతేకాదు..  మృతుడి ఆత్మ తిరుగుతూ కుటుంబ సభ్యులను కూడా  వేధిస్తోంది. కాబట్టి, మరణించినవారి ఆత్మ మోక్షానికి, మరణించినవారికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. ఇంట్లో వాళ్లు కాకుండా..వేరే వారికి ఆ వస్తువులు దానం చేయడం వల్ల.. ఎలాంటి నష్టం ఉండదు. కుటుంబ సభ్యులు కాకుండా.. వేరే వాళ్లు వేసుకుంటే.. పెద్దగా ఇబ్బంది, నష్టం ఏమీ ఉండదు.

Latest Videos

click me!