మీ చేతి గీతలను బట్టి.. మీ జీవితం ఉంటుంది అంటే మీరు నమ్ముతారు. హస్తసాముద్రికం పై నమ్మకం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. భారతదేశంలో చాలా మంది దీనిని బాగా నమ్ముతారు. మన చేతి రేఖల ఆధారంగా మన జీవితంలో ప్రేమ, పెళ్లి, డబ్బు లాంటి విషయాలు కూడా తెలుస్తాయట. కానీ తెలుసా.. ఈ హస్తసాముద్రికం నమ్మేవారు.. తమ చేతి రేఖలు తరచూ మారిపోతూ ఉంటాయని నమ్ముతారట. అందుకే.. తరచూ తమ చెయ్యి చూపించుకుంటూ ఉంటారు.
palm
ఈ సంగతి పక్కన పెడితే.. మన అర చేతిలో ఒక రేఖ కనుక ఉంటే.. మనకు జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలుస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. మన చేతిలో మన ఆయుష్షు, విద్య , ఆరోగ్యం రేఖలు కూడా ఉంటాయి.
మీ బొటనవేలు దగ్గర నుండి ఒక రేఖ బుద్ధ పర్వతానికి వెళితే, అది పూర్వీకుల ఆస్తికి సంకేతం. బుద్ధ పర్వతం అంటే చేతి చిన్న వేలికి దిగువన ఉన్న భాగం. అదేవిధంగా, కొన్ని కారణాల వల్ల మీ చేతిపై M గుర్తు ఏర్పడి స్పష్టంగా ఉంటే, మీ జీవితంలోని ఏదో ఒక దశలో మీకు చాలా డబ్బు ఉంటుందని ఇది చూపిస్తుంది. వివాహం తర్వాత కూడా మీరు అదృష్టాన్ని పొందవచ్చు. అదేవిధంగా, మీరు మీ చేతిలో తరాజు షేపు కలిగి ఉంటే, అప్పుడు లక్ష్మీ దేవి మీ చేతిలో నివసిస్తుంది. మీ చర్యలు మీ భవిష్యత్తులో ఆర్థిక లాభాలను సూచిస్తాయి. మీ చేతిలో ఉన్న ప్రమాణాల సంకేతం మీరు న్యాయంగా ఉండాలని సూచిస్తుంది. న్యాయం చేస్తే లక్ష్మి ఉంటుంది, లేకుంటే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, లక్ష్మికి కోపం వస్తుంది. మీ చేతిలో ఎంత మంచి రేఖలు ఉన్నా.. అన్యాయంగా సంపాదించాలని చూస్తే మాత్రం ఆ డబ్బు నిలవదు.
నక్షత్రం గుర్తును అదృష్టవంతులుగా భావిస్తారు
మీ బొటనవేలు కింద నక్షత్రం గుర్తు ఉంటే, మీరు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ఈ గుర్తు ఉంటే.. మీరు జీవితంలో అన్ని సుఖ సంతోషాలు పొందుతారని, ముఖ్యంగా వివాహం తర్వాత అదృష్టవంతులుగా మారతారని అర్థం. చేతిలో నక్షత్రం గుర్తు... పర్వతం ఆకారం మీద ఉన్నట్ల అయితే... తరచూ విదేశీ ప్రయాణాలు ఉన్నాయని అర్థమట.
మీ అరచేతి రేఖలు చేప ఆకారంలో ఉంటే.. అది కూడా బొటనవేల ు కింద ఉంటే.. మీకు డబ్బు ఎక్కువగా వస్తుందని అర్థం. అదే.. మీ చేతిలో వి ఆకారంలో రేఖలు ఉంటే... మీ జీవితంలో సంబంధాలు చాలా బాగుంటాయని అర్థమట. మీ జీవితంలోకి వచ్చిన వారితో చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలోకి వచ్చిన భాగస్వామి కారణంగా మీరు విజయాలను అందుకుంటారు.