Today Horoscope: ఓ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

Published : Aug 16, 2024, 05:30 AM IST

Today Horoscope:రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది... వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి కలిసి వస్తుంది..? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి..? ఈ రోజు రాశిఫలాల్లో మనం తెలుసుకుందాం.  

PREV
112
 Today Horoscope: ఓ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
telugu astrology

మేషం:

ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు చేపట్టిన ప్రతి పని పూర్తవుతుంది. ప్రతి పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు. వాహనం, భూమి కొనుగోలు మీకు లాభాదాయకంగా ఉండనుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, యువత తమ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. షాపింగ్ తో ఎక్కువ ఖర్చు చేస్తారు. వ్యాపారానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దల సలహాలు, సూచనలు తీసుకోండి. చిన్న విషయానికే ఒత్తిడికి గురవుతారు.
 

212
telugu astrology

వృషభం:

ముందుకు సాగని పనులను పట్టుకుని కూర్చోకోకుండా ముందుకు సాగండి. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. చిన్న నాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఒక విషయం వల్ల పిల్లల ఆత్మగౌరవం, సామర్థ్యం తగ్గుతుంది. అందుకు పిల్లలపై ఆంక్షలు పెట్టకండి. ప్రతికూల మాటలు మిమ్మల్ని బాధపెడతాయి. వ్యాపారానికి సంబంధించిన పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేస్తారు.  భార్యాభర్తల బంధం మధురంగా ఉంటుంది. ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

312
telugu astrology

మిథునం:

ఇంట్లో  శుభకార్యానికి ప్రణాళిక వేస్తారు. దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు. భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది. కష్టపడి పనిచేస్తే మంచి విజయాన్ని పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అపరిచితులను నమ్మకండి. స్వార్థపూరితమైన వ్యక్తులతో అన్ని విషయాలను పంచుకోకండి. వ్యక్తిగత, వ్యాపార కార్యకలాపాలలో సమన్వయాన్ని కొనసాగించండి. దీంతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జ్వరం,ఒంటి నొప్పులు ఉంటాయి. 
 

412
telugu astrology

కర్కాటకం:

కుటుంబ సభ్యుల మధ్యగొడవలను పరిష్కరిస్తారు. పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. ఆగిపోయిన ప్రభుత్వ పనులు అధికారుల సహకారంతో పూర్తవుతాయి. మీ సీక్రేట్ బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సన్నిహితులతో వివాదాలొస్తాయి. కోపం తగ్గడానికి కాసేపు ఒంటరిగా గడపండి. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. 
 

512
telugu astrology

సింహ రాశి:

ఒక మంచి ఆలోచనతో రోజును ప్రారంభిస్తారు. గ్రహ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఇంటిని చక్కబెట్టుకోవడంలో ఈ రోజు చాలా  బిజీగా ఉంటారు. సోమరితనంతో కొన్ని పనులను వాయిదా వేస్తారు. కానీ ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఒక చెడ్డ వార్త మీ మనసును పాడు చేస్తుంది. ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారం నిదానంగా సాగుతుంది.

612
telugu astrology


కన్య:

మార్కెటింగ్ లేదా మీడియాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మీ ఫ్రెండ్ లేదా బంధువు మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇరుగుపొరుగు వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల నుంచి ఆశించడానికి బదులు మీ స్వంత నైపుణ్యాలను నమ్మండి. మార్కెటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టండి. భార్యాభర్తల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. 
 

712
telugu astrology


తుల:

ప్రతికూల పరిస్థితులు కాస్త మీకు అనుకూలంగా మారుతాయి. సంఘంలో గొప్ప వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మీ ప్రతిభ నలుగురిలో గుర్తించబడుతుంది. రాజకీయ పనులను పూర్తి చేయడానికి అనుభవం ఉన్నవారు మీకు సహాయం చేస్తారు. కోపం, ఆవేశం మీ పనులను ఆలస్యం చేస్తాయి. డబ్బులతో పనులు తొందరగా పూర్తవుతాయి. మీ కష్టానికి తగ్గ సరైన ఫలితాన్ని పొందుతారు.  దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 
 

812
telugu astrology


వృశ్చికం:

ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు. కెరీర్, ఆధ్యాత్మికత, మతం పురోగతిలో మీ సామర్థ్యాలను పెంచుకుంటారు. మీ పూర్తి సహకారం పిల్లలకు ఉంటుంది. కానీ ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. కానీ త్వరలోనే పరిస్థితి మీ అదుపులోకి వస్తుంది. విద్యార్థులు అనవసరమైన పనులతో టైం ను వేస్ట్ చేయకూడదు. వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. 
 

912
telugu astrology

ధనుస్సు:

ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. సమయానికి తగ్గట్టు మంచి నిర్ణయం తీసుకోండి. ఇంటికి బంధువులు వస్తారు. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటి పెద్దల సలహాలు పాటించండి. సారూప్యత, సానుకూల వ్యక్తులతో స్నేహం చేయండి. వ్యాపారులు ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఒత్తిడి. కడుపు నొప్పి సమస్యతో బాధపడతారు. 
 

1012
telugu astrology


మకరం:

భవిష్యత్ ప్రణాళికలో పూర్తి బిజీగా ఉంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సమాజ సేవలో పాల్గొంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. జీవితంలో మీరు అనుకున్నట్టుగా ఏదీ జరగదు. ఇవి మీకు అనుభవాలు అవుతాయి. ఆర్థికంగా పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారం అంతంత మాత్రమే ఉంటుంది. బలహీనత, శరీర నొప్పులు ఉంటాయి. 
 

1112
telugu astrology

కుంభ రాశి:

పనులను, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేయడం కష్టంగా ఉంటుంది. అయినా అన్ని పనులను సక్రమంగా చేస్తారు. కొంతమంది మాత్రమే మీకు పనిలో సహాయపడతారు. ఎవ్వరి మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో విందు వినోధాల్లో ఎక్కువ సమయం గడపకుండా మీ పనులను పూర్తి చేయండి. వ్యాపారానికి సంబంధించిన ఒక పెద్ద డీల్ లేదా ఆర్డర్ వస్తుంది. పెళ్లితో ఇంట్లో ఒత్తిడి వాతావరణం ఉంటుంది. జ్వరం లేదా శారీరక అలసట సమస్యలు ఉంటాయి. 
 

1212
telugu astrology

మీనం:

మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేయడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సవాలు మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది. ఆడవాళ్లు ఇంట్లో, బయట సరైన సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఆర్థిక విషయానికొస్తే మీ బడ్జెట్‌ను కాస్త గమనించండి. ప్రతిదీ ఉన్నప్పటికీ మీకు ఏదో ఒక లోటుగా అనిపిస్తుంది. వ్యాపారులు మంచి ఆర్డర్ ను పొందుతారు. భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవలు వస్తాయి. సీజనల్ వ్యాధుల బారిన పడతారు.

Read more Photos on
click me!

Recommended Stories