కాకులు, పావురాలు, గబ్బిలాలు, పిచ్చుకలు ఇంటి ముందుకు వస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 15, 2024, 4:45 PM IST

కాకులు, గబ్బిలాలు, పిచ్చుకలు, పావురాలు ఇంటికి ముందుకు వస్తుంటాయి. ఇది చాలా కామన్. కానీ వీటిలో కొన్ని మనకు శుభాన్ని కలిగిస్తే.. మరికొన్ని అశుభాన్ని కలిగిస్తాయి. అసలు ఏవి శుభం, ఏవి అశుభమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మన ఇంటికి ముందుకు ఎన్నో రకాల జీవులు వస్తుంటాయి. ముఖ్యంగా కాకులు, పావురాలు, పిచ్చుకలు వస్తూ పోతూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని జీవులు మనకు మంచి చేస్తే.. మరికొన్ని జీవులు మనుకు అశుభాన్ని కలిగిస్తాయి. కొన్ని జీవులు మన ఇంట్లోకి వస్తే చెడు శకునంగా భావిస్తారు. ప్రపంచంలోని అన్ని జీవులూ దేవుడు సృష్టించినవే. కానీ  ప్రతి ప్రాణికీ ప్రత్యేకమైన లక్షణాలుంటాయంటారు జ్యోతిష్యులు. అసలు ఏవి శుభ శకునం, ఏవి చెడు శకునమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కాకులు


కాకి

కాకులు మన ఇంటిచుట్టూ ఎన్నో ఉంటాయి. ఇవి మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అయితే కాకి శనీశ్వరుని వాహనంగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ కాకికి ఫుడ్ పెట్టిన తర్వాతే తినాలంటారు జ్యోతిష్యులు. దీనివల్ల మనం తెలిసీ, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది. కాకి ఇంటి వెలుపల, డాబాపై, బాల్కనీలో ఆహారాన్ని పెడితే మంచిది. కానీ కాకి ఇంట్లోకి వస్తే మంచిది కాదంటారు. 
 


గబ్బిలం

హిందూ గ్రంధాల ప్రకారం.. గబ్బిలాలు ఇంట్లోకి అస్సలు రాకూడదు. ఇది ఇంట్లోకి వసతే మీకు ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు. గబ్బిలం ఇంట్లోకి వచ్చిందంటే మీకు ఏదో ఒక చెడు జరగబోతుందని అర్థం వస్తుంది. 

గద్ద

గద్ద కూడా ఇంట్లోకి రాకూడదు. సాధారణంగా గద్దలు పైకి ఎగురుతాయి. చాలా సార్లు ఊర్లల్లో గ్రద్దలు ఇంట్లోకి కూడా వస్తుంటాయి. నమ్మకాల ప్రకారం.. గ్రద్ద ఇంట్లోకి రావడం మంచిది కాదు. గద్ద ఇంట్లోకి వస్తే సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి. బంధం తెగిపోతుంది. 
 

Sparrows

పిచ్చుకలు

చాలా మంది పిచ్చుకలను ఇంట్లోకి రానీయరు. కానీ ఇంట్లోకి పిచ్చుకలు రావడం శుభప్రదం. అవును ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. దీన్ని అదృష్టాన్ని తెచ్చే శుభ శకునంగా భావిస్తారు. పిచ్చుక జన్మించిన ఇంటిలో సంపద పెరుగుతుందని నమ్ముతారు.

గుడ్లగూబ

ఒక్కోసారి గుడ్లగూబలు కూడా ఇంట్లోకి వస్తుంటాయి. ఈ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని పవిత్రంగా భావిస్తారు. గుడ్లగూబ ఇంట్లోకి రాకపోయినా అది బాల్కనీలోనో, ఇంటి లోపలోకి రావడం శుభప్రదం. ఇది ఇంట్లోని సమస్యలను తగ్గిస్తుంది. 


పావురం

చాలా మంది పావురాలను ఇంట్లోకి అస్సలు రానీయరు. కానీ ఇంట్లోకి పావురం వస్తే మంచిదట. ఎందుకంటే ఇది ఇంటికి వస్తే సంపద పెరుగుతుందని నమ్ముతారు. అందుకే  పావురాలకు ధాన్యాలను వేయాలంటారు. వీటికి ఫుడ్, నీరు పెట్టడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. పావురాన్ని మహా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లోకి పావురం వచ్చినా, గూడు కట్టుకున్నా.. మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఇంట్లోకి కందిరీగ లేదా చిలుక వచ్చినా శుభ శకునంగా భావిస్తారు. 

Latest Videos

click me!