ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారు స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది..!

First Published | Jan 7, 2023, 5:10 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు  బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. 

Daily Horoscope

పంచాంగం: 
 తేది : 7జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యం
ఋతువు : హేమంత
పక్షం :  కృష్టపక్షమ                                                                                        
  వారము: శనివారం
తిథి :   పాడ్యమి తెల్లవారుజామున 05 23 వరకు
నక్షత్రం :. పునర్వసు రాత్రి 02 06  ని     వరకు
వర్జ్యం:    మధ్యాహ్నం 12 51ని ల2:37 ని  వరకు
దుర్ముహూర్తం: ఉ.06.36ని నుండి ఉ.08.03ని వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.36ని.లకు
సూర్యాస్తమయం: సా.05.36ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  


Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

సమాజము నందు అపవాదములు.  తొందరపాటు మాటల వలన కలహాలు ఏర్పడుతాయి. చేయ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మనస్సునందు అనేక సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు. హీనమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రయాణాలయందు మరియు పని యందుజాగ్రత్త వహించవలెను. ఈరోజు ఈ రాశివారు ఓం శంభవే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
మానసికంగా  ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి.  కుటుంబ సభ్యులతో టి కలిసి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం  నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి  శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజము నందు మీ బ్రతుకు తగ్గ గౌరవం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. హిందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. సహచరుల వలన అపకారాలు జరగవచ్చును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  11 సార్లు జపించండి  శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
చేయ పనులు పూర్తవుతాయి.  చేయు వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓంసుబ్రహ్మణ్యాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. మనసునందు ఆందోళన తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును. విందూ వినోదాల్లో  పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియైనమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలను పొందండి

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడను ప్రయాణాల్లో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం సంతాన విషయంలో సఖ్యత సఖ్యతగా వెలుగులను ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను కలహాలకు దూరంగా ఉండండి మనసు నందు భయం భయంగా ఉంటుంది ఏ శారీరక శ్రమ అధికంగా ఉండును ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఏర్పడను ఆ కారణమైన ఆవేశం తగ్గించుకుని నిర్ణయాలు తీసుకొనవలెను సమాజం నందు నిందారోపణలు ఏర్పడగలవు ఈరోజు ఈ రాశి వారు  ఓం శివాయ నమః అని 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.   వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది.  సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మిత్రాయ నమః అని  11 సార్లు జపించండి  శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.  బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట ఉంటుంది. చెడు స్నేహితులను  దూరంగా ఉండాలి . చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ.సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం . పెద్దలు పట్ల గౌరవం గా . సమయానుకూలంగా  తెలివిగా ముందుకు . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం . ఓం అర్థ శరీరాయ నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉండును. సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడును. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మనస్సు నందు ఆందోళన. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  . ఓంమంగళ ప్రదాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చెడువార్తల వలన మనసు నందు బాధ  కలుగుతుంది. తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. చేయ పని వారి తోటి సఖ్యతగా ఉండవలెను.  వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలను పొందండి

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .    ఓం బృహస్పతయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Latest Videos

click me!