మేష రాశి...
ఈ రాశివారు గొడవ తర్వాత... ఎదుటివారిపై అరిచేస్తారు. వారు ఎంతటి వారైనా... ఎవరైనా సరే.... తమ కోపాన్ని చూపించి తీరుతారు.
212
Zodiac Sign
వృషభ రాశి..
వృషభ రాశివారు మొండిగా ఉంటారు. ఒక రాయిలాగే ప్రవర్తిస్తారు. ఎవరితోనైనా గొడవ జరిగిన తర్వాత... లేదంటే గొడవ సమయంలో వారు ఏమన్నా అననీ, ఏమన్నా చెప్పని వారు మాత్రం అసలు పట్టించుకోరు.
312
Zodiac Sign
మిథున రాశి..
ఈ రాశివారికి గొడవ పడటం, వాదించుకోవడం అస్సలు నచ్చదు. గొడవ జరిగేలా ఉందంటే చాలు.. ఆ టాపిక్ నే డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
412
Zodiac Sign
కర్కాటక రాశి..
ఈ రాశివారికి ఎవరితోనైనా గొడవ జరిగితే గట్టిగా అరిచేస్తారు. ఎవరితో గొడవ పడ్డారో వారితో తప్పితే.... మిగిలిన వారందరిపై వీరు కోపాన్ని ప్రదర్శిస్తారు.
512
Zodiac Sign
సింహ రాశి..
సింహ రాశివారికి గొడవలు, వాదించుకోవడం పై ఆసక్తి ఎక్కువ. ఎవరైనా వాదనకు దిగితే... వీరు కూడా వాదిస్తూనే ఉంటారు.
612
Zodiac Sign
కన్య రాశి..
కన్య రాశివారు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. గొడవ జరిగితే రెచ్చిపోయి గొడవ పడటం కాకుండా.... ఆ గొడవను ప్రశాంతంగా ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు.
712
Zodiac Sign
తుల రాశి..
తుల రాశివారితో ఎవరైనా గొడవ పడితే... వీరు దాదాపు కామ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా ఏమీ మాట్లాడరు.
812
Zodiac Sign
వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఎదుటివారు ఏమైనా అంటే...వారిపై పగ తీర్చుకునేదాకా ఊరుకోరు. కావాలని పని గట్టుకొని మరీ... వారిని మరింత రెచ్చగొట్టి.. ఇబ్బంది పెడతారు.
912
Zodiac Sign
ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు దేనినీ సీరియస్ గా తీసుకోరు. అందుకే.. గొడవ జరుగుతున్న మధ్యలోనూ పగలపడి నవ్వేస్తూ ఉంటారు.
1012
Zodiac Sign
మకర రాశి...
ఈ రాశివారు వారితో పోనివ్వకుండా... ఆ గొడవ, వాదనలోకి మరొకరిని కూడా లాగుతారు. ఆ గొడవలో ఇతరులను కూడా ఇన్వాల్వ్ చేయనిది వీరికి నిద్రపట్టదు.
1112
Zodiac Sign
కుంభ రాశి..
కుంభ రాశివారికి ఎవరితోనైనా గొడవ పడినా.. వాదనకు దిగినా... వీరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది.
1212
Zodiac Sign
మీన రాశి..
మీన రాశివారితో ఎవరైనా గొడవ పడితే వీరు గట్టిగా ఏడ్చేస్తారు. వీరికి గొడవలు అంటే భయం అందుకే... ముందుగానే ఏడ్చేస్తారు.