
పంచాంగం:
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరం
ఋతువు : హెమంత
పక్షం. కృష్ణపక్షం
వారము: మంగళవారం
తిథి : ద్వాదశి రాత్రి 9:27 ని వరకు
నక్షత్రం :.స్వాతి ఉదయం 6:50 ని వరకు తదుపరి విశాఖ తెల్లవారుజామున 6.18 ని వరకు
వర్జ్యం:మధ్యాహ్నం 12 .18 ని ల01.51 ని వరకు
దుర్ముహూర్తం:ఉ.08.39ని. నుండి ఉ.09.23ని. వరకు తిరిగి రా.10.38ని. నుండి రా.11.30ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.28ని.లకు
సూర్యాస్తమయం: సా.05.26ని.లకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఓం సదాశివాయ నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. ఓం కపర్థినే నమః అనే 11 జపించండి శుభ ఫలితాలు పొందండి
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఓం విష్ణువే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అని11సార్లు చూపించండి. శుభ ఫలితాలు పొందండి.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఓం సదాశివాయ నమః అనే 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓం హిరణ్మయై నమఃఅని 11సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఓం రవయేనమః అని 11సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యంవిషయంలో జాగ్రత్త వహించాలి. ఓం కరుణాయైనమఃనమః అనే 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగమునందు అధికారుల యొక్క పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది. సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మిత్రాయ నమఃఓం అనే 11 సార్లు జపించండి.శుభ ఫలితాలు పొందండి.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను.కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. ఓం మంగళాదేవ్యై నమః అని 11సార్లు జపించింది. శుభ ఫలితాలు పొందండి
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ఖర్చులు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవును. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా జరుగును .అనవసరమైన ఆలోచనలు తోటి వృధాగా కాలాన్ని గడపకండి. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును. ఇతరులతోటి వాదనలు మానండి. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తగా తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం నవదుర్గాయ నమః అని 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి