Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట

Published : Feb 09, 2026, 04:48 PM IST

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా లక్కీ. వీరిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.  వీరు చాలా చిన్నవయసులోనే డబ్బులు సంపాదించి ధనవంతులవుతారు. ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ లక్ దక్కుతుందో తెలుసుకోండి.

PREV
14
ఈ తేదీలలో పుట్టిన వారు

ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి.  ఈ తేదీలలో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఒకటి అంకెకు అధిపతి సూర్యుడు. సూర్యుడిలాగే ఈ వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారికి వెలుగులా మారుతారు.  తమ ఉనికితోనే అందరినీ ఎంతో సానుకూలంగా ప్రభావితం చేస్తారు. రాడిక్స్ 1 కలిగిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. వీరు కష్టపడి పనిచేయడాన్ని చాలా ఇష్టపడతారు. దాన్నే నమ్ముతారు. వారు ఏ పని అయినా కృషి, అంకితభావంతో పని చేసి ముందుకు సాగుతారు.

24
పాతికేళ్ల వయసులోనే

రాడిక్స్ సంఖ్య ఒకటి కలిగిన వ్యక్తులు డబ్బు విషయంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు . సంపాదన, పెట్టుబడి… ఈ రెండింటిపైనా వారికి మంచి అవగాహన ఉంటుంది. రాడిక్స్ సంఖ్య 1 కలిగిన వ్యక్తులు రాజస స్వభావంతో ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికం. ఇతరుల కింద పనిచేసేందుకు అస్సలు ఇష్టపడరు.  జ్యోతిషశాస్త్రం ప్రకారం వీరు చిన్న వయసులోనే అంటే దాదాపు పాతికేళ్ల వయసులోనే ధనవంతులవుతారు. వీరిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉండటం వల్ల జీవితంలో డబ్బుకు లోటు రాదు.

34
ఈ తేదీలలో పుట్టిన వారు కూడా

ఏ నెలలోనైనా 5 ,15, 23వ తేదీలలో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 5. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. ఇక జ్యోతిష శాస్త్రంలో బుధుడిని తెలివితేటలకు అధిపతిగా చెప్పుకుంటారు. రాడిక్స్ 5 కలిగిన వ్యక్తులు చాలా తెలివిగా  నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి విశ్లేషణాత్మక సామర్థ్యం ఎక్కువ. వీరు ఇతరులకన్నా భిన్నంగా ఉంటుంది. రాడిక్స్ సంఖ్య 5 కలిగిన వ్యక్తులు ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే బాగా కలిసివస్తుంది. వీరికి రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. అలాగే పెట్టుబడులపై అవగాహన కూడ ఉంటుంది. ఇది వారిని ఆర్థికంగా బలంగా చేస్తుంది.

44
కుబేరుడి ఆశీస్సులతో

రాడిక్స్ సంఖ్య 5 కలిగిన వారిపై కూడా కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వీరు సంపదను పెంచుకోవడంలో బాగా పనిచేస్తారు. వీరు చాలా తెెలివిగా పెట్టుబడులు పెట్టడంలో నిపుణులు. రాడిక్స్ 5 వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు. వీరు స్టాక్ మార్కెట్ లేదా వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. వీరికి  సంపాదించే సత్తా కూడా ఎక్కువే. వీరి జీవితంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది.  వీరు తమ సొంత కష్టంతో త్వరగా ధనవంతులవుతారు.

Read more Photos on
click me!

Recommended Stories