నవగ్రహాలలో సూర్యుడిదే మొదటి స్థానం. ఒకరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం, గౌరవం, తండ్రితో మంచి సంబంధం వంటివి కలుగుతాయి. సూర్యుడి స్థానంలో చిన్న మార్పు వచ్చినా కూడా రాశులపై తీవ్ర ప్రభావమే పడుతుంది. జీవితంలోని కొన్ని అంశాలపై ఆ ప్రభావం పడుతుంది. పంచాంగం చెబుతున్న ప్రకారం 2026 మార్చి 5న ఉదయం 12:59 గంటలకు సూర్యుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి, మార్చి 15న ఉదయం 01:08 గంటలకు మీనరాశిలోకి, మార్చి 18న ఉదయం 08:27 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి, మార్చి 31న రాత్రి 08:16 గంటలకు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఒకే నెలలో నాలుగు సార్లు సూర్య సంచారం మారబోతోంది. దీని వల్ల మూడు రాశులకు విపరీతంగా కలిసివస్తుంది.