Birth Date: ఈ తేదీలలో జన్మించిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి

Published : Oct 20, 2025, 11:10 AM IST

సంఖ్యా శాస్త్రం (Birth date) ప్రకారం కొన్ని తేదీలు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. కొన్ని తేదీలలో జన్మించిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు విపరీతంగా ఉంటాయి. ఒక నెలలో ఏ తేదీన పుట్టినవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు దక్కుతాయో తెలుసుకోండి. 

PREV
15
లక్ష్మీదేవి ఆశీస్సులు

అదృష్టం అనేది జన్మించిన తేదీని బట్టి ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు కొన్ని తేదీలలో జన్మించిన వారికి ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం రాడిక్స్ సంఖ్య 2, 3, 4, 6 ఉన్నవారికి ఎంతో శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి.

25
రాడిక్స్ సంఖ్య 2

ప్రతి నెలా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 2. రాడిక్స్ సంఖ్య రెండు కలిగిన వారి జీవితాల్లో వృత్తిపరమైన పురోగతి అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో ప్రేమ కూడా దక్కుతుంది. వీరికి సానుకూల మనస్తత్వం ఉండడం చాలా అవసరం. వీరి అదృష్టమైన రంగు తెలుపు. ఇక అదృష్ట సంఖ్య రెండు. వీరికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.

35
రాడిక్స్ సంఖ్య 3

ప్రతి నెలా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య మూడు అవుతుంది. వీరికి ఆర్థికంగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పెట్టుబడులు, లాభాలు కూడా కలిసి వస్తాయి. జీవితంలో ప్రేమ నిండి ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య ఏడు. ఇక అదృష్టాన్ని తెచ్చే రంగు గులాబీ రంగు.

45
రాడిక్స్ సంఖ్య 4

ప్రతి నెలా 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 4. ఈ తేదీలలో జన్మించిన వారికి దీపావళి కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు అదృష్ట సంఖ్య 3. ఇక అదృష్ట రంగు పసుపు.

55
రాడిక్స్ సంఖ్య 6

ప్రతినెలా 6,15, 24 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 6. ఈ తేదీలలో జన్మించిన వారి వ్యక్తుల కుటుంబాలలో ఎంతో అద్భుతమైన సమయం దక్కుతుంది. ఇంట్లో ప్రేమ, ఆనందం వంటివి కలుగుతాయి. కెరీర్ లోను విపరీతమైన పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వీరికి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 5. ఇక అదృష్ట రంగు నీలం.

Read more Photos on
click me!

Recommended Stories