Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టానికి మారుపేరు..!

Published : Oct 24, 2025, 02:37 PM IST

Birth Date: జీవితంలో విజయం సాధించడానికి మనం ఎంత కష్టపడినా.. మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడు అవ్వాలి. అప్పుడే.. చాలా తక్కువ సమయంలో సక్సెస్ అవ్వగలం. అలాంటి అదృష్టం కొందరికి పుట్టుకతోనే వచ్చేస్తుంది. 

PREV
14
Birth Date

న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన స్వభావం, ఆలోచనా సామర్థ్యం, మన కెరీర్ ఇలా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ లో ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలు ఉంటాయి. కొన్ని సంఖ్యలు గ్రహాలతో ముడిపడి ఉంటాయి. ఆగ్రహ ప్రభావాల కారణంగా.... కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వారు ఏ పని చేసినా.. వారికి అదృష్టం తోడు అవుతూ ఉంటుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా....

24
నెంబర్ 4...

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహువు ప్రభావం ఉంటుంది. వీరికి అదృష్టం చాలా ఎక్కువ. వీరెంత అదృష్టవంతులో.. అంతే మంచి మనసుతో ఉంటారు. వీరు అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. కష్టపడి పని చేస్తారు. వీరి కష్టానికి అదృష్టం కూడా తోడు అవుతుంది. అందుకే.. చాలా తొందరగా సక్సెస్ అవ్వగలరు.

34
నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు చాలా అదృష్టవంతులు. బుధ గ్రహ ప్రభావం కారణంగా వీరికి తెలివి తేటలు కూడా చాలా ఎక్కువ. కెరీర్ లో మంచి స్థాయికి వెళ్లగలరు. అదృష్టంతో కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వీరు చిన్నప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.

44
నెంబర్ 7..

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 7, 16 , 25 తేదీలలో జన్మించిన వ్యక్తిని 7వ సంఖ్యగా పరిగణిస్తారు. కాబట్టి, 7వ సంఖ్య గల వ్యక్తుల అధిపతి కేతువు. కాబట్టి, ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అందంగా , ప్రశాంతంగా ఉంటారు. 7వ సంఖ్య గల వ్యక్తులు వారు చేసే ప్రతి పనిలోనూ చాలా సులభంగా విజయం సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి అదృష్టం కూడా చాలా ఎక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories