ఈ నాలుగు నెలలో జన్మించినవారికి సంతానయోగం చాలా ఎక్కువ..!

Published : Aug 23, 2025, 12:31 PM IST

 ఈ నాలుగు నెలల్లో జన్మించిన వారికి ఎక్కువ మంది పిల్లలు పుడతారు. గ్రహాల ప్రత్యేక ఆశీస్సుల వల్ల , కొన్ని నెలల్లో జన్మించిన వారికి ఎక్కువ మంది పిల్లలు పుట్టే అదృష్టం ఉంటుంది. 

PREV
15
Birth Month

సంతాన యోగం అందరికీ లభించదు. ఈరోజుల్లో చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు లేకుండా జీవితం పూర్తి కాదు అనే చెప్పాలి. సంతానం పొందడం దంపతుల సొంత నిర్ణయం అయినప్పటికీ.. కొన్ని నెలల్లో జన్మించిన వారికి ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ముఖ్యంగా నాలుగు నెలల్లో జన్మించిన వారికి సంతాన యోగం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి, ఆ నెలలు ఏంటో చూద్దాం...

25
1.సెప్టెంబర్...

సెప్టెంబర్ లో జన్మించిన వారికి ఎక్కువ మంది సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారికి శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. శుక్రుడు అంటే.. ప్రేమ, అందాన్ని సూచించే గ్రహం. ఈ గ్రహం ఆశీర్వాదం ఈ నెలలో జన్మించినవారిపై ఎప్పుడూ ఉంటాయి. అందువల్ల.. ఈ సెప్టెంబర్ లో జన్మించిన వ్యక్తులు ఎక్కువ మంది సంతానం కలిగి ఉంటారు. వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబాన్ని పెంచుకోవడానికి వీరు ఎక్కువ కృషి చేస్తారు. వారు కోరుకున్నట్లే.. వీరికి ఎక్కువ సంతానం ఉంటారు.

35
2.జులై

జులై నెలలో జన్మించిన వారిని కూడా శుక్రుడు పాలిస్తూ ఉంటాడు. ఈ గ్రహం ప్రేమ,అందంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారికి కూడా ఎక్కువ సంతానం కలిగే అవకాశం ఉంది. ఈ నెలలో పుట్టిన వారికి కూడా కుటుంబం పట్ల ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని వీరు భావిస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండాలని అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీరు పెద్ద కుటుంబం కావాలని కలలు కంటారు. తమలో ఉన్న నాయకత్వ లక్షణాలు తమ పిల్లల్లో కూడా ఉండాలని అనుకుంటారు. ఈ నెలలో జన్మించినవారు అద్భుతమైన పేరెంట్స్ కూడా అవ్వగలరు.

45
డిసెంబర్

డిసెంబర్ నెలను శని గ్రహం పాలిస్తుంది. శని క్రమశిక్షణ, న్యాయానికి దేవుడు. ఈ నెలలో జన్మించిన వారిపై శని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. డిసెంబర్ నెలలో జన్మించిన వారు శని అనుగ్రహం వల్ల చాలా మంది పిల్లలను కంటారు. అలాగే, డిసెంబర్ నెలలో జన్మించిన వారు సాహసోపేత స్ఫూర్తికి ప్రసిద్ధి చెందారు. ఈ ఉత్సాహం వారి కుటుంబ జీవితానికి కూడా విస్తరిస్తుంది. జీవితం పట్ల వారి ఉత్సాహం తరచుగా వైవిధ్యమైన , చురుకైన కుటుంబాన్ని సృష్టించడానికి దారితీస్తుంది. వారికి కొత్త అనుభవాలపై గొప్ప ఆసక్తి ఉంటుంది. వారి సాహసోపేత స్ఫూర్తి పెద్ద కుటుంబాన్ని సృష్టించడానికి దారితీస్తుంది.

55
ఫిబ్రవరి

ప్రేమను జరుపుకునే ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పిల్లలు ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని వారు నమ్ముతారు. ఈ నెలలో జన్మించిన వ్యక్తులు లోతైన కరుణను కలిగి ఉంటారు. ఇది వారిని అద్భుతమైన సంరక్షకులుగా చేస్తుంది. వారు తమ జీవితాల్లో కుటుంబ బంధాలు, భావోద్వేగ సంబంధాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. వారు ఎల్లప్పుడూ భావోద్వేగ మద్దతును అందించడానికి, ప్రేమ వాతావరణాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories