Solar Eclipse: సూర్యగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 3:17 నిమిషాల నుండి సాయంత్రం 7:56 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం కుంభరాశిపైనే అధికంగా ఉంటుంది. అది కూడా దాదాపు నెలపాటు ఉండే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణం కుంభరాశి, ధనిష్ట నక్షత్రంలో సంభవించబోతోంది. ఇది మధ్యాహ్నం మూడు గంటల 17 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా కుంభరాశి వారిపైనే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్య గ్రహణం తర్వాత నెలపాటు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
24
ఉద్యోగ జీవితం
కుంభ రాశి వారి ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులు లేదా ఒత్తిళ్లు పెరగవచ్చు. ఉన్నతాధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లేదా అదనపు బాధ్యతలు వచ్చి ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే ఓర్పును కలిగి ఉండండి. ఓర్పుతో, వ్యూహంతో ముందుకు వెళితే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో మార్పులను చేసేందుకు ఇది అనుకూలమైన సమయం కాదు.
34
ఆర్థిక పరిస్థితి
ఆర్థికంగా కుంభరాశి వారికి స్థితి ఉంటుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. డబ్బును సమయానికి చేతికి ఆలస్యం జరుగుతుంది. పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. గ్రహణం సమయంలో ప్రధాన ఆర్థిక నిర్ణయాలు ఏవీ తీసుకోకపోవడమే మంచిది. ఈ గ్రహణ సమయంలో డబ్బును ఆదా చేయడం గురించి ఆలోచించాలి.
కుంభ రాశి వారి వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కొంత గొడవలు ఉండవచ్చు. అపార్ధాలు కలగవచ్చు. సంబంధాల మధ్య దూరం పెరగవచ్చు. అలాంటి సమయంలో సైలెంట్‌గా ఉండడం మంచిది. కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలసట, ఒత్తిడి వంటివి లేకుండా చూసుకోవాలి. నిద్రలేమి, మానసిక ఆందోళన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి యోగా, ధ్యానం, సమతుల ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.