మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ తప్పకోవచ్చు. చేసే పనులు తీసుకునే నిర్ణయాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు వ్యవహారాలు ఇబ్బందికి గురిచేస్తాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. మాటల్లో తొందరపాటు పనికిరాదు. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిల్వ ధనం కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరులకు సహకారాన్ని అందించడం మంచిది. సహకారాలు కోరకూడదు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. నిత్యావసర ఖర్చులపై దృష్టి సారిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమ తప్పకపోవచ్చు. కొత్త పనుల నిర్వహణలో కొంత జాగ్రత్త అవసరం. సంప్రదింపులకు అవకాశం. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. లాభాలు సంతృప్తినిస్తాయి. పితృవర్గీయులతో అనుకూత ఏర్పడుతుంది. కళాకారులకు అనుకూల సమయం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. నిర్ణయాదుల్లో తొందరపడి తీసుకోరాదు. వ్యవహారశైలిలో అప్రమత్తంగా మెలగాలి. కాలం ధనం శ్రమ వ్యర్థం అయ్యే సూచనలు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. లాభాలు సంతృప్తి నిస్తాయి. అన్ని రకాల లాభాలు ఆదరిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ ఆర్థికాంశాల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. పితృవర్గ వ్యవహారాలపై ప్రత్యేకదృష్టి సారిస్తారు. ఖర్చులు పెట్టుబడులు శుభ పరిణామాలనిస్తాయి. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో శుభ పరిణామాలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యారంగంలో రాణింపు వస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. పెద్దవారితో అనుబంధాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తికర జీవనం కొనసాగిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పితృవర్గ సంబంధ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. సంతృప్తినీ ఇస్తాయి. పదోన్నతికి అవకాశం ఏర్పడుతుంది. వ్యాపార రంగాల వారు శుభ పరిణామాలు చూస్తారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. శ్రీ రామ జయరామజయజయ రామరామ జపంమంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ప్రయాణాల్లో జాగ్త్రతలు అవసరం. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. మానసిక ఒత్తిడి అధికం. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెడతారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. విద్యారంగంలో పరిపూర్ణ ఉన్నతి. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. కాన కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో అభ్యున్నతి. కార్యనిర్వహణలో శుభ పరిణామాలు ఏర్పడతాయి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. వాయిదా వేసుకోవడం మంచిది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమతో కార్యక్రమాల సాధన చేస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్యాలపై దృష్టి అధికంగా చేసే అవకాశం. పరిచయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అధికారిక వ్యవహారాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. పితృవర్గ సంబంధాలు పెరిగే సూచనలు. ప్రమాదాలకు అవకాశం ఉన్నది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : క్రియేివిటీ పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. సంతానం వల్ల ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సృజనాత్మకతకోసం ప్రయత్నం చేస్తారు. పోటీల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. కాంపిటీషన్స్‌లో అనుకూలత ఏర్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. ఋణాలు అధిగమిస్తారు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీ రామజయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. గృహ, వాహనాదుల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు పూర్తిచేయడంలో జాగ్రత్తగా మెలగాలి. సృజనాత్మకత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యవహారాలు చవిచూస్తారు. అన్ని పనుల్లో శ్రమ ఉన్నా గెలుపు లభిస్తుంది. శత్రు, రుణ, రోగాదులపై ఒత్తిడి ఏర్పడుతుంది. కార్యనిర్వహణలో సంతోషం ఏర్పడుతుంది. అలసిపోయే సూచనలు ఉన్నాయి. వేరు వేరు పనుల ఒత్తిడి తప్పక పోవచ్చు. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు కొంత ఒత్తిడి సమయంగా అవుతుంది. సౌకర్యాలపైదృష్టి పెరుగుతుంది. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. శారీరకమైన ఒత్తిడులు ఏర్పడతాయి. గృహ, వాహనాదుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. సృజనాత్మకత ఉన్నా ఆచి, తూచి వ్యవహరించాలి. సంతానం విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఓం నమో నారాయణాయ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మాటల్లో నైపుణ్యత పెంచుకుంటా రు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి పెడతారు. సంప్రదింపులకు అనుకూలం. అధికారుల సహకారం లభిస్తుంది. సోదరవర్గీయులతో జాగ్రత్తగా మెలగాలి. దగ్గరి ప్రయాణాలుంటాయి. అధికారిక పర్యటనలకు అవకాశం ఏర్పడుతుంది. రచనారంగంలో కొత్తవారికి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. పితృవర్గీయులతో కలిసే అవకాశం ఏర్పడుతుంది. సౌకర్యాలపైదృష్టి పెడతారు. గృహ వాహనాదుల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.