ఈ వారం(24మే నుంచి 29మే) వరకు రాశిఫలాలు

First Published May 24, 2019, 10:36 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అన్ని పనుల్లో ప్రయోజనాలు ఆశిస్తారు. లాభాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. కొత్త వార్తలు వినడం వల్ల కొంత ఇబ్బందిపడతారు. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. ఖర్చులు అధికమౌతాయి. అనేక రూపాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. వ్యాపారాదుల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. గౌరవలోపం లేకుండా చూసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. శ్రమతో కార్యనిర్వహణ చేస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి. అనేక కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. ఆహార విహారాలపై ప్రత్యేకదృష్టి ఏర్పడాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. ఆర్థిక నిల్వలు కోల్పోయే ప్రమాదం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. అన్ని ప్రయోజనాలుసంతోషాన్నిస్తాయి. లాభాలు ప్రభావితం చేస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. విద్యాత్మక అంశాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. సుదూర ప్రయాణాలగూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవకార్యక్రమాల నిర్వహణ చేస్తారు. దానధర్మాలు సంతృప్తినిస్తాయి. నిర్ణయాలలో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకోని సమస్యలుంటాయి. తొందరపాటు పనికిరాదు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఉంటాయి. అధికారిక కార్యక్రమాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని సమస్యలు ఏర్పడతాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. కార్యనిర్వహణలో లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. వ్యర్థమైన ఖర్చులుంటాయి. కాలం, ధనం, కోల్పోయే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులలో లోపాలు ఉన్నాయి. విశ్రాంతి తగ్గుతుంది. ఆలోచనలకు అనుకూలత ఏర్పడుతుంది. మానసిక బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానధర్మాలు మేలు చేస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సామాజిక వ్యవహారాలను నేర్పుగా సాగిస్తారు. భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. అనుకూలత కోసం ప్రయత్నించాలి. అనేక రూపాల్లో లాభాలున్నా తొందరపాటు కూడదు. సోదరవర్గంతో సమస్యలు లేకుండా చూసుకోవాలి. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. అనారోగ్య భావన చికాకుగా ఉంటుంది. నిర్ణయాల వాయిదా మంచిది. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : గెలుపుకోసం ప్రయత్నం అధికం అవుతుంది. ఋణాదులను గూర్చి చర్చిస్తారు. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. వ్యవహార దక్షత ఏర్పడుతుంది. బాధ్యతలను సక్రమంగా శ్రమతో నిర్వహిస్తారు. గుర్తింపు లభిస్తుంది. మొండితనం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. అనేక రకాల పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం ఏర్పడుతుంది. మంచి వార్తలు వినే అవకాశం. పరిచయాలు పెరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులకు రూపకల్పన స్పెక్యులేషన్‌స లాభిస్తాయి. విద్యాత్మక వ్యవహారాల్లో శుభపరిణామాలు ఏర్పడతాయి. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి ఏర్పడుతుంది. అన్నింలోనూ లాభాలు ఏర్పడతాయి. అసంతృప్తి ఉన్నా దూర ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. నేర్పుగా వ్యవహరిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విద్యారంగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. శ్రమతో వ్యవహారాలను నిర్వహిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అనుకోని సమస్యలు, ప్రమాదాలు అవకాశం ఏర్పడుతుంది. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. ప్రణాళిక ప్రకారం కార్యనిర్వహణ ఉంటుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపార ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. కుటుంబంలో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంప్రదింపులకు అనుకూలం ఏర్పడుతుంది. అనేక రకాల సహకారాలు లభిస్తాయి. సమాచారం సంతోషాన్నిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గీయులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాలు ప్రభావితం చేస్తారు. విద్యాత్మక ప్రయాణాలకు అనుకూలమైన సమయం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆహార విహారాది సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాదులపై కొత్త భావనలు వస్తాయి. ఆలస్య నిర్ణయాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కుటుంబ విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులు బాధ్యతలు నిర్వహిస్తారు. ఆర్థిక నిల్వలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. పోీల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమాధిక్యం ఉంటుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తయి. సోదవర్గం వారితో అనుకూలత ఏర్పడుతుంది.కమ్యూనికేషన్స్‌ లాభిస్తాయి. మంచి వార్తలు వింరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాదులకు అనుకూలమైన సమయం. కొత్త పనులపై దృష్టి పెడతారు. గుర్తింపు లభిస్తుంది. గౌరవాదులను పెంచుకునే ప్రయత్నం. భాగస్వామాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పరిచయాలు విస్తరిస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలపై అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఉన్నా గౌరవం లభిస్తుంది. స్థిరాస్తుల గురించి ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఖర్చులు అధికం అవుతాయి. పెట్టుబడులు అనేక రూపాల్లో ఉంటాయి. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. కొన్ని పరామర్శలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన సమయం. సౌకర్యాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. గృహ వాహనాదుల్లో జాగ్రత్తలు అవసరం. ఆహార విహారాల్లో తొందరపాటు కూడదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత లక్ష్యాలపై దృష్టి అవసరం. సాధన వలన సంతృప్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
click me!