ఈ వారం 17మే నుంచి 23మే వరకు రాశిఫలాలు

First Published May 17, 2019, 10:14 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కొన్ని వ్యతిరేక సంఘటనలు ప్రభావితం చేస్తాయి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవడంమంచిది. శ్రమాధిక్యం ఎక్కువగా ఉంటుంది. అనుకోని నష్టాలకు అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్యభావనలుంటాయి. అసంతృప్తి ఉంటుంది. దైవధ్యానం, దర్శనం వల్ల మేలు జరుగుతుంది. కొత్తపనులపై దృష్టి ఉంటుంది. దూర ప్రయాణభావన ఉన్నా ఫలితం సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం ఉంటుంది. మార్పుకోసం ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : భాగస్వామ్యాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెంచుకుంటారు. అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి పెరుగుతుంది. సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ధైర్యంచాతుర్యంతో ఎదుర్కోవాలి. నిర్ణయాదుల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు ఉంాయి. అనుకోని సమస్యలు ఉంాయి. అనారోగ్య భావనలు ఉంాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాల్సిందే. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీలు వ్యతిరేకతలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనేక కార్యక్రమాలను నిర్వహించాలనే తపన ఉంటుంది. ఋణాలపై విజయం సాధిస్తారు. రోగనిరోధకశక్తి పెంచుకుంటారు. అందరితో జాగ్రత్తగా మెలగాలి. శత్రుభావనకు దూరంగా ఉండాలి. వ్యాపారాలకోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. కొంత ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. శ్రీమాత్రే నమః జపం మంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ఆహార సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆలోచనలకు రూపకల్పన చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానవర్గంతో అనుకూలంగా గడుపుతారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. మొండితనంలో పనులు చేయాల్సి ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. ఋణ, రోగాదులపై ప్రతయ్నపూర్వకమైన విజయం సాధిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : స్త్రీలు, మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. విద్యార్థులు శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. సౌకర్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. కార్యనిర్వహణలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రణాళికలు ఆశించిన సంతోషాన్నివ్వక పోవచ్చు. పోటీలు ఒత్తిడులుంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. మంచి వార్తలను వింరు. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. గురుతుల్యులు అనుకూలత ఏర్పడుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. పిల్లలకు పెద్దలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. గృహ వాహనాదుల విషయంలో కొత్త నిర్ణయాదులు పనికిరాదు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రణాళికలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనుకూలంగా గడుపుతారు. నిల్వధనం బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాటల్లో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అందరికీ తలలో నాలుకలా మెలుగుతారు. శ్రామిక, కార్మికవర్గ సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలను బాగా నిర్వహిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విహార యాత్రలు చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. నిత్యావసర వస్తువులపై దృష్టి పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనులూ అనుకూలంగా సాగుతాయి. కార్యనిర్వహణా దక్షత ఏర్పడుతుంది. నిర్ణయాదులు అన్ని రకాలుగా ఉపకరిస్తాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతలు నిర్వహిస్తారు. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు చేసుకుంటాయి. గుర్తింపు లభిస్తుంది. ముందుజాగ్రత్త అవసరం. బంధువర్గంతో జాగ్రత్తగా మెలగాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని రకాల లాభాలు ప్రభావితం చేస్తాయి. స్త్రీల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. దానధర్మాలు ప్రభావితం చేస్తాయి. వ్యాపారాదుల్లో మేలు కలుగుతుంది. కార్యనిర్వహణలో సంతోషం, సంతృప్తి కలుగుతుంది. ప్రయాణాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు ఒత్తిడులపై విజయం సాధిస్తారు. బద్ధకం అధికంగా ఉంటుంది. అవమానాలు ఎదురుకావచ్చు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో అధిక శ్రమ ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అన్ని పనుల్లో ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. లాభాలు అనేక రూపాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. పెట్టుబడులు వృథా అవుతాయి. ఆచి, తూచి వ్యవహరిస్తారు. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఉన్నత విద్యలపై లక్షసాధన ఉంటుంది. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనేక కార్యక్రమాల నిర్వహణ సమర్ధత పెరుగుతుంది. బాధ్యతలు ఎక్కువౌతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఒత్తిడి తప్పకపోవచ్చు. దైవధ్యానంతో కార్యక్రమాలు నిర్వహించడం మేలు. లాభాలు ఆశించినంతంగా రాకపోవచ్చు. పెద్దలతో ఇబ్బందులుంటాయి. జాగ్రత్త వహించడం మంచిది. శ్రీ మాత్రేనమః జపంమంచిది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఆటంకాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. కార్యనిర్వహణలో సంతృప్తి ఉంటుంది. వైజ్ఞానిక ధోరణిని పెంచుకుంటారు. ఆధ్యాత్మిక జీవితం సంతోషాన్నిస్తుంది.సుదూర ప్రయాణ భావన. పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తారు. చేసేవృత్తిలో ఒత్తిడులు ఉంాయి. ఉద్యోగాలలో శ్రమలు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లో సమస్యలుంటాయి. శ్రమతో కార్యనిర్వహణ శక్తిని పెంచుకుంటారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
click me!