ఈ వారం( జులై 26నుంచి ఆగస్టు1వరకు) రాశిఫలాలు

First Published | Jul 26, 2019, 10:24 AM IST

వార ఫలాలు ఇలా ఉన్నాయి

ఓ రాశివారికి నిల్వ ధనం పెరుగుతుంది. మరో రాశివారికి మాట విలువ పెరుగుతుంది. ఓ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మరో రాశివారికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. నిల్వధనం సమకూర్చుకులుంటారు. మాట విలువ పెరుగుతుంది. క్రమంలో సంప్రదింపులులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలులుంటాయి. సోదర వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. ఉన్నతలక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని వార్తలు ప్రభావితం చేస్తాయి. కమ్యూనికేషన్స్‌ విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. శ్రీ మాత్రేనమః.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆత్మ విశ్వాసం పెంచుకులుంటారు. నిర్ణయాదులు లాభిస్తాయి. బాధ్యతలు పెంచుకులుంటారు. సంతోషంగా అన్ని పనుల్లోనూ పాల్గొలుంటారు. క్రమంగా కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. బంధువర్గంతో కలయిక ఏర్పడుతుంది. మ్లాడే తీరులో కొంత అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం వ్యర్థంగా పోకుండా చూసుకోవాలి. వ్యాపార వ్యవహారాల వైపు దృష్టి కేంద్రీకరిస్తారు. కమ్యూనికేషన్స్‌ విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఖర్చులు అధికం. పెట్టుబడులు తప్పకపోవచ్చు. ప్రయాణాలులుంటాయి. విందులు, వినోదాలు, విహారాలకోసం వెచ్చిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. క్రమంగా నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకులుంటారు. ఇతరుల భావనలకు లోబడే అవకాశం ఉంది. జాగ్రత్త తొందరపాటు కూడదు. అన్ని నిర్ణయాదుల్లో ఆచి, తూచి, ఆలోచించి వ్యవహరించాలి. కుటుంబ ఆర్థికాంశాలు ప్రాధాన్యం వహిస్తాయి. నిల్వధనం కోసం ఆలోచిస్తారు. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొలుంటారు. మాటల్లో అతి జాగ్రత్త వహించాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) :లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకులుంటారు. శారీరక ఒత్తిడులు ఉన్నా కార్యాలలో అనుకూలత ఏర్పడుతుంది. క్రమంగా ఖర్చులు అధికం. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులులుంటాయి. విశ్రాంతికోసం ప్రయత్నించినా దొరకక పోవచ్చు. పరామర్శలకు అవకాశం. విందులు వినోదాలకోసం ప్రయాణాలులుంటాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగినా మొండితనం అధికమౌతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలు, సామాజికాంశాలపై దృష్టి ఏర్పడుతుంది. తండ్రి తరపు వారి విషయాలు చర్చలోకి వస్తాయి. గుర్తింపు, గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. క్రమంగా అన్ని పనుల్లోనూ లాభాలపై దృష్టి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పనుల నిర్వహణ చేస్తారు. వ్యాపార వ్యవహారాలకోసం ఖర్చులు చేస్తారు. కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నిలోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సుదూర లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. పరిశోధన రంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకులుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రయాణావకాశాలు ఉంటాయి. క్రమంగా సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గుర్తింపు గౌరవాదులు ప్రాధాన్యం వహిస్తాయి. అధికారిక వ్యవహారాల్లో శుభపరిణామాలు. లాభాలు ప్రాధాన్యం వహిస్తాయి. అనేక రూపాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. క్రమంగా నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. ఉన్నత విద్య ఏర్పడుతుంది. ఉద్యోగాలు ప్రాధాన్యం వహిస్తాయి. సుదూర ప్రయాణాలులుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తిలో గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గౌరవం పెంచుకులుంటారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మీయత పెరుగుతుంది. భాగస్వామితో కలిసి దూర ప్రయాణం చేసే అవకాశం. క్రమంగా అన్ని పనుల్లోనూ లోపాలకు అవకాశం. ముఖ్యంగా వ్యాపార నష్టాలులుంటాయి. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావాలు ఏర్పడతాయి. వ్యవహారాలు ఇబ్బందిపెట్టే అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. నిర్ణయాదులు వాయిదా వేయడం మంచిది. కొత్త పనులపై దృష్టి ఏర్పడుతుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఆశించిన సంతృప్తి ఉండదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వ్యతిరేకతలు అధికం. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. పోటీలు ఒత్తిడులు ఉంటాయి. చికాకు పడకుండా కార్యనిర్వహణ చేయాలి. ఋణ, రోగాదులు ప్రాధాన్యం వహిస్తాయి. క్రమంగా భాగస్వామ్యాలు ప్రాధాన్యం వహిస్తాయి. పరిచయాలు పెంచు కుంటారు.. పాత మిత్రుల కలయిక జరుగుతుంది. కొత్త భావాలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార భాగస్వామ్యాల్లో ఇబ్బందులు. అనుకోని సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య భావాలు పెంచు కుంటారు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. క్రియేటివిటీని పెంచుకుంటారు. సంతానవర్గం వ్యవహారాలు ఆలోచిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. క్రమంగా వ్యతిరేకతలు వస్తాయి. పోటీలు, ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. విజయ సాధనపై దృష్టి అవసరం. శారీరక ఒత్తిడులు శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. ఋణ రోగాదులు ఇబ్బందిపెట్టే సూచనలు. భాగస్వామ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, వ్యాపారాలు, కాంటాక్టులు అన్ని వ్యవహారాల్లోనూ కొంత ప్రయోజనం ఉన్నా ఇబ్బందులు కూడా ఉండవచ్చు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహ, వాహనాదుల విషయం చర్చకు వస్తుంది. ప్రయాణాలకు అవకాశం. శ్రమతో విద్యా వ్యవహారాలు ఉంటాయి. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. వైజ్ఞానిక భావనలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులను అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి కమ్యూనికేషన్స్‌ లాభిస్తాయి. కొత్త వార్తలు వింరు. సోదరవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు. క్రమంగా విందులు వినోదాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. అన్ని పనుల్లోనూ శ్రమ తప్పకపోవచ్చు. గృహ వాహనాది సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి శుభ పరిణామాలు. ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం. సంతానవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. సృజనాత్మకత ఉన్నా సమయానుకూలంగా వినియోగపడకపోవచ్చు. శ్రీమాత్రేనమః.

Latest Videos

click me!