మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు. పెద్దలతో కొంత జాగ్రత్త అవసరం. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు, వినోదాలు, విహారాలకు సంబంధించిన ఖర్చులు, ప్రయాణాలుటాంయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొటాంరు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. కొంత అసంతృప్తి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక గౌరవం లభిస్తుంది. భాగస్వామాల్లో శుభ పరిణామాలు. అధికారుల ఆదరణ లభిస్తుంది. తర్వాత అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. లాభాలు కొంత సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. కొన్ని అనుకూలతలు కూడా ఉంటాయి. ఆకస్మిక ఇబ్బందులు ఏర్పడే సూచనలు. సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల, వ్యాపారాస్తుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంభవం. కార్య నిర్వహణలో సంతోషం లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఉన్నత విద్య ఉద్యోగాదులు, కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఏర్పడుతుంది. పరిశోధన ప్రాధాన్యం. సుదూర ప్రయాణ భావన. పోటీరంగంలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల. అధికారిక వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో సంతృప్తి. సామాజిక గౌరవం లభిస్తుంది. గుర్తింపులు పెరుగుతాయి. పెద్దల ఆదరణ ఉంటుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార జీవిత భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార, జీవిత భాగస్వామ్యాలతో సమస్యలకు అవకాశం. మంచి మాటతీరువల్ల ఆకట్టుకుటాంరు. శ్రీమాత్రేనమః జపం.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావనలు వస్తాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేస్తారు. సంతాన వ్యవహారాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. తర్వాత సుదూర ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలుటాంయి. దైవ, ధర్మ కార్యాలలో పాల్గొటాంరు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. వైజ్ఞానిక పరిశోధనలపై దృష్టి ఏర్పడుతుంది. విద్య ఉద్యోగాదుల్లో సంతృప్తి. పోటీరంగంలో కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆత్మతవిశ్వాసంతో ఉంటారు. శ్రీమాత్రేనమః జపంమంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక అనుబంధాలకు అనుకూలం. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత అనుకోని సమస్యలు ఎదురౌతాయి. శారీరక మానసిక ఒత్తిడులు. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. దైవధ్యానంలో కాలం గడపాలి. ఆలోచనల్లోనూ ఒత్తిడి. సంతానవర్గంతో జాగ్రత్త అవసరం. వ్యాపారాదుల్లో అనేక రూపాల్లో పెట్టుబడులుటాంయి. కాలం వ్యర్థమయ్యే సూచనలు అధికం. సుదూర ప్రయాణాలపై దృష్టి. అనేక బాధ్యతలను సంతృప్తితో నిర్వర్తిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాల్సి వస్తుంది. విజయసాధన సంభవం. పెద్దలతో సంప్రదింపులు ఉంటాయి. తర్వాత పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణావకాశాలున్నాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సౌకర్యాలు శ్రమకు గురి చేసే అవకాశం. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాదుల్లో అనేక రూపాల్లో ప్రయోజనాలు లభిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అభీష్టాలు నిరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గంతో సంతోషంగా కాలం గడుపుతారు. నూతన కార్యక్రమాలపై ప్రత్యేకదృష్టి పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఉంటుంది. ఆర్థికస్థితి పెరుగుతుంది. తర్వాత వ్యతిరేక ప్రభావాలు అధికమౌతాయి. శత్రువులను ఎదిరించాలి. ఋణాలు, రోగాల బారికి గురి అయ్యే అవకాశం. సేవకవర్గంతో సంప్రదింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకుటాంరు. భాగస్వామితో కాలం గడుపుతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఆహార విహారాలకు అనుకూల సమయం. సౌకర్యాలు పెంచుకుటాంరు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొటాంరు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులకు అనుకూలం. క్రమంలో అభీష్టాలు నెరవేర్చుకుటాంరు. క్రియేివిటీ పెరుగుతంది. కొత్త పనులను ఆనందంగా నిర్వర్తిస్తారు. సంతానవర్గ వ్యవహారాల్లో అభివృద్ధి. కుటుంబంలో కొంత ఒత్తిడి. ఆర్థిక నిల్వలు తగ్గవచ్చు. ఉన్నత విద్య ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు చికాకులు అన్ని పనుల్లో ఉంటాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుటాంయి. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. ధార్మిక కార్యక్రమాలకోసం కాలం, ధనం వెచ్చించే అవకాశం. క్రమంలో సౌకర్యాలు పెంచుకుటాంరు. విద్యారంగంలోని వారికి అనుకూలత పెరుగుతుంది. ఆహార విహారాల్లో శుభ పరిణమాలు. ఆత్మవిశ్వాసం ఇంకా పెంచుకోవాలి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాల్లో సంతృప్తి ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుటాంరు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుటాంయి. క్రమంలో సంప్రదింపులకు అనుకూలం అవుతుంది. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అనుకూలం. వ్యర్థమైన ఖర్చులు పెట్టుబడులుటాంయి. సోదరుల వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి.ఆహార విహారాలకోం కాలం ధనం వెచ్చిస్తారు. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారు. కొత్త పనులపై దృష్టి పెడతారు. బాధ్యతలు అధికం అవుతాయి. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. క్రమంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి. బంధువర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన లాభాలు అందకపోయే అవకాశం. వ్యాపారాదుల్లో విపరీతమైన పోటీ పెరుగుతుంది. విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఖర్చులు పెట్టుబడులు అధికంగా చేస్తారు. వేరు వేరు రూపాల్లో కాలం, ధనం వెచ్చించాల్సి వస్తుంది. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొటాంరు. క్రమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల బాధ్యతలు చేప్టాల్సి రావచ్చు. శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాదులు ఉంటాయి. కొత్త పనుల నిర్వహణ చేస్తారు. ప్లానింగ్ ఉంటుంది. వృత్తిలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఆలోచనల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాల్లో సంతోషం పెరుగుతుంది. కుటుబంలో శుభ పరిణమాలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.