Vastu Tips: ఇంటి గుమ్మం దగ్గర వీటిని ఉంచుతున్నారా?

First Published May 21, 2022, 3:49 PM IST

చాలా మంది ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాక్ పెడుతూ ఉంటారు. ఇంటి మొయిన్ ఎంట్రెన్స్ దగ్గర షూ ర్యాక్ పెట్టడం అంత మంచిది కాదు.  కొద్దిగా దూరంగా పెట్టుకోవడం ఉత్తమం.

9 Vaastu Shastra Tips for Doors and Windows

ఇల్లు కట్టేటప్పుడు వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  అయితే... ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు.. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే ఆ ఇంటికి అంత మంచి జరుగుతుందట. ముఖ్యంగా... ఇంటి గుమ్మం ముందు కొన్ని జాగ్రత్త లు తీసుకోవాలట.

ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే.. ఇంటి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. కొన్ని వస్తువులు గుమ్మం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో సంతోషం కరువౌతుందట.
 

jose door whip

చాలా మంది ఇంటి గుమ్మం ముందు డస్ట్ బిన్ లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల  ఇంట్లో శుభం జరగదట. డస్ట్ బిన్ లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి.. డస్ట్ బిన్ లు పెట్టకపోవడమే మంచిది.

door

చాలా మంది ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాక్ పెడుతూ ఉంటారు. ఇంటి మొయిన్ ఎంట్రెన్స్ దగ్గర షూ ర్యాక్ పెట్టడం అంత మంచిది కాదు.  కొద్దిగా దూరంగా పెట్టుకోవడం ఉత్తమం. ఆ ప్లేస్ లో  ఏదైనా అందమైన బొమ్మ, లేదంటే ఒక పచ్చని మొక్క పెట్టుకోవడం ఉత్తమం.

door

ఇక చాలా మంది ఫ్యాషన్ కోసం ఇంటి గుమ్మం డోర్ ని స్లైడ్స్ రూపంలో పెట్టుకుంటారు. అయితే.. వాస్తు ప్రకారం అలా పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మం డోర్ తీస్తున్నప్పుడు అది బయటకు వచ్చేలా ఉండాలి. అలాంటి డోర్ ఉంటే ఇంటికి మంచి జరుగుతుంది. అలా కాకుండా.. డోర్ ఇంటి లోపలికి వెళ్లేది పెట్టుకోవడం అంత శుభకరం కాదు. డోర్ బయటకు తెరుచుకుంటే.. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా కలుగుతుందట.

ఇంటి గుమ్మం దగ్గరలో విరిగిపోయిన వస్తువులు, చెత్త చెదారం లాంటివి పెట్టకపోవడమే మంచిది. ఇలాంటివి పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఇంటి డోర్లు కూడా వివిధ రకాల మెటీరియల్స్ తో చేయిస్తున్నారు. అంటే గ్లాస్ డోర్స్ లాంటివి. అవి కాకుండా.. చెక్కతో చేయించిన డోర్ పెట్టుకోవడం ఉత్తమం. చెక్క తో చేసిన డోర్  ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది.

ఇంటికి నేమ్ ప్లేట్ పెట్టుకోవడం చాలా మంది చేస్తారు. అయితే... ఆ నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీతో పాటు.. నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే.. ఆ నేమ్ ప్లేట్ పై దేవుడి ఫోటో లాంటివి పెట్టుకోవడం ఉత్తమం.

click me!