ఈ వారం( ఆగస్టు 2 నుంచి ఆగస్టు8 వరకు) రాశిఫలాలు

First Published Aug 2, 2019, 10:01 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి 

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. శ్రమతో కూడిన కార్యక్రమాలు. అధికారిక వ్యవహారాలపై దృష్టి ప్రయాణావకాశాలు. సంతాన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. పోటీలు ఒత్తిడులుంటాయి. సౌఖ్యం కోసం తీవ్రంగా ప్రయత్నించాలి. శ్రమాధిక్యం. నిర్ణయాదుల్లో శ్రమ ఉంటుంది. ఆహార విహారాల్లో ఇబ్బందులు అధికం. తెలియని భయం ఉంటుంది. సంప్రదింపులు అధికం. కొత్త వార్తల వల్ల కొంత కన్‌ప్యూజన్‌కు అవకాశం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. శ్రీరామజయరామ జయజయ రామరామ జపం.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారిక సంప్రదింపులు. ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో ఇబ్బందులు ఏర్పడతాయి. సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. పెద్దల సహకారం. ఆలోచనలకు రూపకల్పన. మంచి వార్తలు వింరు. సంతాన వ్యవహారాల్లో సంతోషం. అభీష్టాలు నెరవేరుతాయి. భాగస్వామి సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ ఇబ్బంది పెట్టవచ్చు. అననుకూలమైన వార్తలుంటాయి. మీడియా రంగం వారికి సమస్యలు. కుటుంబ ఆర్థికాంశఆలిల్లో అత్యాశలు ఉంటాయి. బంధువర్గంతోనూ జాగ్రత్తగా మెలగాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చు. మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. సంప్రదింపుల్లో కొంతజాగ్రత్త అవసరం. బంధువర్గంతో అసంతృప్తి ఏర్పడుతుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలుంటాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలకు అవకాశం. లాభాలపై దృష్టి పెరుగుతుంది. వ్యతిరేకతలను అధిగమిస్తారు. మాటతీరు వల్ల సమస్యలు. నిల్వధనంపై ప్రత్యేకదృష్టి. నిర్ణయాదుల్లో అతి జాగ్రత్త. అత్యాశ ప్రభావితం చేస్తుంది. అతి విశ్వాసం సమస్యలకు దారితీసే అవకాశం. శ్రీమాత్రేనమః జపంమంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరకమైన ఒత్తిడులు అధికం. కొంత అనారోగ్యానికి అవకాశం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ నిర్ణయాల్లో కొంత ఒత్తిడికి అవకాశం. సంప్రదింపులకు అనుకూలం. సోదరీమపణుల సహకారం లభిస్తుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. మంచి వార్తలు వింరు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. వృత్తిపరమైన ఒత్తిడులుంటాయి. సంతాన వ్యవహారాల్లో కొత్త సమస్యలు. తొందరపాటు నిర్ణయాలు కూడదు. శారీరకమైన చికాకులకు అవకాశం. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులకు అవకాశం. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు. అధికారిక ప్రయాణాలు. విశ్రాంతిలోపం. నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి. పరామర్శలకు అవకాశం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. కుటుంబంలో అనుకూలం. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు సమకూర్చుకుంటారు. బంధువర్గంతో సంతృప్తి. ప్రయాణాలకు అవకాశం. ధన వినియోగంలో జాగ్రత్త అవసరం. సౌకర్యాలకోసం వెచ్చిస్తారు. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. కొన్ని లాభాలున్నా అప్రమత్తంగా మెలగాలి. ఊహించని ప్రయోజనాలుంటాయి. అత్యాశ పనికిరాదు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనేక రూపాల్లో ప్రయోజనాలు. పెద్దల అనుకూలత పెరుగుతుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొంత శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని పెట్టుబడుల వల్ల మాత్రమే ఉన్నతి కలుగుతుంది. నిర్ణయాలు లాభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతోషంగా గడుపుతారు. కొత్త పనులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లాభాలు కొన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఊహించని సమస్యలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి ఏర్పడుతుంది. పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధికారిక వ్యవహారాల్లో శుభపరిణమాలు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణావకాశాలు. విశ్రాంతి లభిస్తుంది. విందులు, వినోదాలు, విహారాలకు అవకాశం. సామాజిక గౌరవం కొంత శ్రమకు గురిచేయవచ్చు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమతో ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెరుగుతుంది. సుదూర ప్రయాణాలపై దృష్టి. శ్రీమాత్రేనమః జపం.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వృత్తి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఒత్తిడులు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. పెద్దల అనుకూలత. గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెంచుకుంటారు. ప్రయోజనాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. కొత్త పనులు ప్రారంభం. నిర్ణయాదుల్లో ఒత్తిడులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు లాభిస్తాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని నష్టాలుంటాయి. అధికారికమైన లోపాలకు అవకాశం. వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అనారోగ్య భావనలు. ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. క్రమంగా సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణమాలు. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. ప్రమోషన్‌లకు అనుకూలం. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ప్రమాదాలకు అవకాశం. ఆలోచనల్లో ఒత్తిడులు. ఖర్చులు పెట్టుబడులు అధికం. ఊహించని నష్టాలుంటాయి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. శ్రీమాత్రే నమః జపం.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్త వహించాలి. అధికారిక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు వస్తాయి. భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. కొత్త పరిచయాల్లో జాగ్రత్త అవసరం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. సుదూర ప్రయాణాలు చేస్తారు. విద్య, ఉద్యోగం, విజ్ఞానం మొదలైన రంగాల్లో అభీష్టాలు నెరవేరుతాయి. సామాజికమైన గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాల సాధన. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. నిర్ణయాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. అనారోగ్య లోపాలు ఏర్పడతాయి. ఊహించని నష్టాలకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్తఅవసరం. కొత్త నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. శ్రమతో గుర్తింపు, గౌరవాదులకు ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. క్రియేటివిటీ తగ్గేసూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. వ్యతిరేకతలను అధిగమిస్తారు. సంతానవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ప్రేమలు పెంచుకుంటారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే మార్గంలో శ్రమ చేస్తారు. ఆందోళన లేకుండా చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
click me!