మేషం :వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. విద్యార్ధులకు ఉత్తమ సమయంగా గోచరించుచున్నది. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదముగా నెలకొనును. జనసహకారము ప్రయోజనకరముగా ఉంటుంది.ఈ రాశి వారికి ఆరోగ్య విషయములో జాగ్రత్తగా ఉండుట అవసరము. అనుకోని ఖర్చులు సూచితము. ప్రయాణములలో జాగ్రత్త అవసరము. 9,10 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తత్రేయస్తోత్ర పారయ్యన, శివారాధన స్రేయస్కరం.
వృషభము : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదముగా సాగుతాయి. విద్యార్ధులకు ఉత్తమ సమయము. సమాజిక సంబంధాల విషయంలో చక్కి అనుబంధములు ఏర్పడును. వృత్తి, ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరము. 11,12 తేదీలలో ముఖ్య నిర్ణములను వాయిదా మంచిది. వీరికి శివారాధన దుర్గాస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
మిధునం :వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలు ఆనంద ప్రదముగీ ఉండును. జనసహకారము ప్రయోజనకరముగా ఉంటుంది. తోబుట్టువుల సహకారము బాగుండును.ఆర్ధిక ప్రయోజనాలు బాగుాంయి. ఇతరులతో మటలాడునప్పుడు ఆచి తూచి వ్యవహరించ వలెను. 13,14,15 తేదీలలొ ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
కర్కాటకం :వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. గృహ, కుటుంబ వీషయములలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ఆర్ధిక స్థితి అనుకూలముగా ఉంటుంది. పొటీ రంగములో అవకాశములు అధికముగా ఉంాయి. వృత్తి, ఉద్యోగ విషయములలో మంచి అభివృద్ధి కనిపించును. దూర ప్రయాణములకు ఆస్కారం. 16, 17 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
సింహం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. గృహ, కుటుంబ విషయములలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. పెద్దల సహాయ సహకారములు లభించుటకు ఆస్కారమున్నది. విద్యార్ధులకు అనుకూల సమయము. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. 18,19,20 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారయణ, విష్ణ్వారాధన, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
కన్య : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. గృహ, కుటుంబ విషయములు ఆనందప్రద వాతావరణం మెలకొనును. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయము. తోబుట్టువుల వలన లాభము సూచితము. ఆహార విషయములో సమయపాలన అవసరము. ప్రయాణములలో జాగ్రత్త వహించవలెను . 21,22 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ,శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం .
తుల : వీరికి గోచారగ్రహస్థితి అనుకూలముగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి మరియు ఆర్ధిక లాభాలు సూచితం. విద్యార్ధులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం. సేవక జనసహకారం ప్రయోజనకరమూగా ఉండును. 23,24,25 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
వృశ్చికం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వీరికి వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి సూచితమౌతున్నది. విద్యార్ధులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం. ఇతరులకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చుకోవానికి ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. 26,27 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన. దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారయణ శ్రేయస్కరము.
ధనుస్సు : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. గృహ,కుటుంబ విషయములు ఆనందప్రదముగా ఉండును. వీరికి ఆకస్మిక ధనలాభం సూచితం. దాన, ధర్మాలకు ఎక్కువగ ఖర్చు చేస్తారు. గృహ నిర్మాణముకు అనుకూల సమయము. ప్రయాణ సమయములో జాగ్రత్త వహించవలెను. 28, 29 తేదీలలో ముఖ్య నిర్ణయముల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయస్తోత్రం శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరము.
మకరం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. ఆకస్మిక ధనలాభం సూచితం. సంతాన వర్గం విజయాలు సంతృప్తినిస్తాయి. పెద్దలనుండి సహాయ సహకారములు లభిస్తాయి. ఖర్చుల విషయంలో ఆరోగ్య విషములో జాగ్రత్త అవసరము. పొటీ రంగములో విజయావకాశములు అధికంగా ఉండును.2,3,30,31 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర శివారాధన, గణపతి పారాయణ శ్రేయస్కరం.
కుంభం: వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉండును. ఆరొగ్యము బాగుండును. విద్యార్ధులకు ఉత్తమ సమయము. వృత్తి, ఉద్యోగ విషయములలో సానుకూల వాతావరణం నెలకొనును. 4,5 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర పారా%ఖ%అన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ,గణపతి పారాయణ శ్రేయస్కరం
మీనం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. గృహ, కుటుంబ విషయములలో సానుకూల వాతావరణము నెలకొనును. పొటీ రంగములో విజయావకాశములు అధికముగా ఉండును. అధ్యాత్మిక చింతన పెరుగును. సోదర సహకారం బాగుండును. విద్యా, ఆహార విషయాలలో సమయపాలన పాటించాలి. 6,7,8 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర గణపతి పారాయణ శ్రేయస్కరం.