మేషం : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. స్వతంత్రంగా లక్ష్యాలను సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచితం. భాభాగస్వామ్య వ్యవహారాలు సులువుగా చేసుకొాంరు. దానధర్మాల కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. ఆహార విద్యా విషయాల్లో సమయ పాలన పాించాలి.ఆరోగ్య విషయంపై శ్రద్ధ అవసరం. 22,23 తేదీలలో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయుట మంచిది. ఈ రాశి వారికి ఆదితాహృదయస్తోత్ర పారాయణ, శివారాధన, దత్తాత్రేయ స్తోత్రపారాయణ, లక్ష్మీ ఆరాధన శ్రేయస్కరం.
వృషభం: ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. సామాజిక సంబంధ విషయాలలో చక్కి అనుబంధం ఏర్పడును.జన సహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహ, కుటుంబ విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. సోదర సహకారం బావుంటుంది.24,25 తేదీలలో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయుట మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ, విష్ణ్వారాధన, లక్ష్మీ ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
మిధునం : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పోటీరంగంలో విజాయావకాశాలు అధికం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనంద వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. తోివారితో మ్లాడేటప్పుడుజాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూల సమయం. 26,27,28,1 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యరాధన, దత్తాత్రేయ స్తోత్రపారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రంగా ఉంది. పోటీరంగంలో విజయావకాశాలు సూచితం. గృమ, కుటుంబ విషయాలు ఆనందంగా ఉంాయి. సంతానం విషయంలో సంతృప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల విషయం అనుకూల వాతావరణం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వీరికి ఆర్థిక లాభాలు సూచితం. వీరు 29,30,2,3 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన, దుర్గాస్తోత్రపారాయణ శ్రేయస్కరం.
సింహం : ఈ రాశివారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వీరికి పోటీ రంగంలో విజయావకాశౄలు అధికంగా ఉండును. విద్యార్థులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనంద వాతావరణం. దూర ప్రయాణాలకు అవకాశం. సామాజిక సంబంధాల విషయాల్లో జాగ్రత్త అవసరం. వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.4,5,6 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
కన్య : వీరికి శీఘ్రగమన గోచారగ్రహస్థితి అనుకూలం. జన సహకారం ప్రయోజనకరంగా ఉంది. వీరికి పోటీరంగంలో విజయావకాశాలు అధికంగా ఉంాయి. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. పెద్దల నుండి సహాయసహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం.7,8 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి విష్ణ్వారాధన, శివారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
తుల : వీరికి గోచారగ్రహస్థితి అనుకూలంగా ఉంది. వీరికి జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. మాసాంతంలో పోటీరంగంలో విజయావకాశాలు అధికంగా ఉంాయి. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం. సేవకజన హకారం ప్రయోజనకరంగా ఉండును. వీరికి మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక విజయాలు. ప్రథమార్థంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 9,10 ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి విష్ణ్వారాధన, దుర్గాస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
వృశ్చికం : వీరికి గోచారగ్రహస్థితి ప్రతికూలంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదంగా ఉంాయి. జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. ఇతరులతో మ్లాడునప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు శ్రమ అధికం. 11,12తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది.వీరికి ఆదిత్య హృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన, శివారాధన శ్రేయస్కరం.
ధనుస్సు : వీరికి గోచారగ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. సోదర సహకారం ప్రయోజనకరంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదంగా ఉండాలి. దాన, ధర్మాలకు ఎక్కువ ఖర్చు పెడతారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో మరియు విద్యా విషయాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఎదుి వారితో మ్లాడునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 13,14,15 తేదీలలో ముఖ్య నిర్ణయాల్లో వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, విష్ణ్వారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
. మకరం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉంది. జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. ధనలాభాలు సూచితం. విద్యార్థులకు అనుకూల సమయం. ఖర్చుల విషయంలో మోసపోకుండా జాగ్రత్త పడాలి. సంతానవర్గం విషయంలో అనుకూల వాతావరణం సూచితం. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం. 16,17 తేదీలలో మఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి లక్ష్మీ ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ, శివారాధన శ్రేయస్కరం.
కుంభం : వీరికి గోచారగ్రహస్థితి అనుకూలత అధికం. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతి, ఆర్థిక లాభాలు సూచితం. వీరు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం సూచితం. సంతానం విషయంలో సంతోషకర వాతావరణం. పోటీరంగంలో విజయావకాశాలు అధికం. 18,19 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్రపారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
మీనం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. వీరికి ఉద్యోగ విషయాల్లో పదోన్నతి సూచితం. పెద్దల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. వృత్తి ఉద్యోగ విషయాల్లో మరియు సంతాన విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చు అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. 20,21 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, విష్ణ్వారాధన, శివరాధన శ్రేయస్కరం.