1.వృషభ రాశి...
వృషభ రాశి వారికి ఆర్థిక సంకల్పం, ఆచరణాత్మకతకు ప్రసిద్ధి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సహజ ప్రతిభను కలిగి ఉంటారు. వారికి ఓర్పు, పట్టుదల కూడా చాలా ఎక్కువ. ఇది కాలక్రమేణా వీరికి సంపదను పెంచుకోవడానికి సహాయపడుతుంది. వారు ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని ఆదా చేయడం మొదలుపెడతారు. ఇది వారి కలల ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువ పొదుపు చేస్తారు. అందుకే, వీరికి డబ్బు కొరత అనేది ఎప్పుడూ రాదు.