ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ తోనే చాలా మంది గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే.. వాక్ ఛాతుర్యం కూడా ఓ బెస్ట్ టాలెంట్ గా చెప్పొచ్చు. అవును.. ఎలాంటి విషయాన్నైనా అవతలికి వ్యక్తికి శ్యావ్యంగా చెవిన పడాలి అంటే.. అది మాట్లాడేవారిలోనే ఉంటుంది. కొందరికి ప్రసంగాలు చెప్పడంలో టాలెంట్ ఉంటే.. కొందరికి.. ఎదుటివారిని తమ మాయలతో మాయ చేసి.. తమ బుట్టలో పడేసుకుంటూ ఉంటారు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం.. గుర్తించవచ్చట. ఏయే రాశుల వారు మాటలతో మాయ చేసేయగలరో ఓసారి చూసేద్దామా..
26
1.మేష రాశి..
తమ మాటలతో మాయ చేయడం మేష రాశివారికి వెన్నతో పెట్టిన విద్య. వీరి బిహేవియర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. వీరి మాటల మాయజాలానికి ఎవరైనా ఇట్టే పడిపోతారు. ఎలాంటివారినైనా ఇట్టే తమ బుట్టలో వేసుకుంటారు. ఇట్టే ఆకర్షించేస్తారు.
36
2.మిథున రాశి..
ఈ రాశివారు చాలా సోషలైజ్డ్ గా ఉంటారు. ఎక్కువ మందితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. కొత్త వారితో అయినా.. ఇట్టే కలిసిపోతారు. మంచి విషయాలను అందరికీ వివరిస్తూ ఉంటారు. వీరి మాటలకు వారికి తెలీకుండానే అందరూ ఫిదా అయిపోతారు.
46
3.సింహ రాశి..
ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఏది మంచి.. ఏది చెడు.. ఏం చేయాలి..? అంటూ అందరికీ చెబుతూ ఉంటారు. అన్ని విషయాల్లో చాలా బాధ్యతగా ఉంటారు. వీరు మాట్లాడే పద్దతి అందరికీ నచ్చేస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా నచ్చినవారితో కలిసిపోవడానికి శతవిధాల ప్రయత్నిస్తారు.
56
4.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎంతో ఎమోషనల్ పర్సన్స్. వీరు మనసులో చాలా రహస్యాలను దాచుకుంటూ ఉంటారు. అయితే.. వీరి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే వారు.. వీరికి ఇట్టే ఆకర్షితులైపోతారు.ఇక అదే ఈ రాశివారి పనిని సులభతరం చేస్తుంది. తద్వారా తమ మాటలతో ఇతరులను ఈజీగా కట్టిపడేస్తారు.
66
5. ధనస్సు రాశి..
ఈ రాశివారు ఇతరుల పట్ల సులభంగా ఆకర్షితులవ్వరు. కానీ ఎవరైనా నచ్చి ప్రయత్నిస్తే.. తప్పనిసరిగా వారిని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీరి చమత్కారమైన మాటలు ఎదుటవారిని ఆకట్టుకుంటాయి.