ఈ 5 రాశులను ఎవరైనా ఈజీగా మోసం చేసేస్తారు..!

First Published | Sep 6, 2024, 12:08 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు ఎప్పుడూ ఎదుర్కొనవలిసిందేనట. ఈ రాశులవారిని... ప్రేమించిన వారు కూడా ఈజీగా మోసం చేసేస్తారట. మరి, ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

Zodiac Sign

జీవితం అనే ప్రయాణం నమ్మకం అనే నావ మీద సాగుతూ ఉంటుంది. మన జీవితంలో మనకు ఎందరో వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. వారిలో కొందరినైనా మనం మనస్ఫూర్తిగా నమ్మేస్తూ ఉంటాం. కానీ... అలా మంచివారు, మనకు ద్రోహం చేయరు అని నమ్మినవారే.. మనల్ని ఘోరంగా మోసం చేస్తే ఆ బాధ వర్ణనానీతం. అలాంటి బాధను జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు ఎప్పుడూ ఎదుర్కొనవలిసిందేనట. ఈ రాశులవారిని... ప్రేమించిన వారు కూడా ఈజీగా మోసం చేసేస్తారట. మరి, ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

telugu astrology

1.మీన రాశి..
మీన రాశివారు ఇతరుల పట్ల చాలా సానుభూతితో ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని ఈ రాశివారు ఈజీగా నమ్మేస్తారు. అందరినీ మంచివారు అనుకుంటూ ఉంటారు. ఎదుటివారిలో ని మంచి క్వాలిటీ మాత్రమే చూస్తారు. చాలా ఆదర్శంగా ఉంటారు. అంత మంచిగా ఉన్నా.. ఇతరులలో మంచి మాత్రమే చూసినా.. వారి మంచి తనాన్ని ఆసరగా తీసుకొని ఈ రాశివారిని మోసం చేస్తారు. ముఖ్యంగా ప్రేమించినవారు.. వారికి ఎప్పుడూ పక్కన ఉండేవారే.. వారిని మోసం చేస్తారు.

Latest Videos


telugu astrology

2.తులారాశి

తుల రాశివారు జీవితంలో బ్యాలెన్స్ ని కోరుకుంటారు. తమతో ఉన్నవారు కూడా.. తమ లైఫ్ ని బ్యాలెన్స్ గా ఉండాలని అనుకుంటారు. దాదాపు ఈ రాశివారు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. తమ చుట్టూ కూడా గొడవలు జరగకుండా ఉండాలని అనుకుంటారు. అయితే.. వీరు గొడవలకు దూరంగా ఉండాలని అనుకోవడం అనే వ్యక్తిత్వం కారణంగా.. వీరిని అందరూ ఇష్టపడరు. ఎదుటివారు అవమానించినా, కోపం చూపినా వీరు ప్రశాంతంగా ఉండే వ్యక్తిత్వాన్ని అదనుగా చేసుకొని వీరిని ఎదుటి వ్యక్తులు మోసం చేస్తారు.

telugu astrology

3.వృషషభ రాశి,,,
వృషభం తరచుగా విశ్వసనీయంగా ఉంటారు. చాలా  నమ్మకంగా ఉంటారు. తమకు జీవితంలో ఎదురయ్యేవారితో వీరు చాలా నమ్మకంగా ఉంటారు. ఈజీగా అందరినీ నమ్మేస్తారు.  కానీ వీరిలో మొండితనం చాలా ఎక్కువ. దాని కారణంగా.. ఈ రాశివారిని కొందరు ఇష్టపడరు.  ఎవరైనా తమను మోసం చేస్తే ఈ రాశివారు జీర్ణం చేసుసకోలేరు. కానీ.. అలాంటి వ్యక్తిత్వం ఉన్నా కూడా.. ఈ రాశివారిని ఈజీగా అందరూ మోసం చేసేస్తారు.

telugu astrology

4.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారు మానసికంగా సున్నితంగా ఉంటారు. వారి ప్రియమైన వారితో ఎక్కువగా కనెక్షన్ పెట్టుకుంటారు. వారి బలమైన భావోద్వేగ బంధాలు వారిని మోసపూరిత సంకేతాలకు గురిచేయవచ్చు, ఎందుకంటే వారు తరచుగా వారిని ప్రశ్నించడం కంటే వారి సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినా.. వీరిని ఈ రాశివారిని ఈజీగా మోసం చేసేస్తారు.

telugu astrology


5.ధనస్సు రాశి..

ఈ రాశివారు చాలా సాహసోపేతంగా ఉంటారు. ఓపెన్ మైండెడ్. ఈ రాశివారిని కూడా అందరూ ఈజీగా మోసం చేసేస్తారు. . వారి ఆశావాదం,  కొత్త అనుభవాల కోసం కోరికలు వారిని చాలా త్వరగా ప్రజలను విశ్వసించటానికి దారితీయవచ్చు, అందరినీ ఈజీగా నమ్మేయడం వల్ల కూడా.. ఈ రాశివారిని ఈజీగా అందరూ మోసం చేసేస్తారు.

click me!