Today Horoscope: ఓ రాశివారికి అనుకోని కష్టాలు ఎదురవుతాయి

Published : Sep 06, 2024, 05:30 AM IST

Today Horoscope:రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది... వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి కలిసి వస్తుంది..? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి..? ఈ రోజు రాశిఫలాల్లో మనం తెలుసుకుందాం.  

PREV
112
 Today Horoscope: ఓ రాశివారికి అనుకోని కష్టాలు ఎదురవుతాయి
telugu astrology


మేషం:

మీక ఈ రోజు బాగా ప్రారంభమవుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆదర్శాన్ని కాపాడుకోవడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తారు. లక్ష్యాన్ని సాధించడంలో దగ్గరి బంధువు సహాయం పొందుతారు. ఏదైనా మతపరమైన లేదా సామాజిక ప్రణాళికకు బాధ్యత వహించాల్సి వస్తుంది. వ్యక్తిగత కార్యక్రమాలలో చాలా బిజీగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంపై దృష్టి పెట్టలేరు. ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతినే అవకాశం ఉంది. 
 

212
telugu astrology

వృషభం:

ఆధ్యాత్మిక, క్షుద్ర శాస్త్రాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీకు అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొన్నిసార్లు ఎక్కువ చర్చలు విజయం చేజారేలా చేస్తాయి. అందుకే నిర్ణయాలను వెంటనే తీసుకోండి. యువత కొన్ని కారణాల వల్ల కెరీర్‌కు సంబంధించిన ప్రణాళికలకు దూరంగా ఉంటారు. ఈ రోజు ఎక్కువ సమయం మార్కెటింగ్, బయటి కార్యకలాపాలను పూర్తి చేయడానికే వెచ్చిస్తారు. 

312
telugu astrology

మిథునం:

ఈ రోజు మీ పనులను తొందరపాటుతో కాకుండా సక్రమంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సంబంధాన్ని బలంగా ఉంచుకోవడంలో మీ ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి. ఇంటి సరైన క్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీ కోపం ఎలాంటి కారణం లేకుండా మీకు హానిచేస్తుంది. పాత ఆస్తి కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందం జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది.

412
telugu astrology

కర్కాటకం:

ఏదైనా రాజకీయ పని ఆగిపోయి ఉంటే.. అది ఈ రోజూ పూర్తి అవుతుంది. గత కొంత కాలంగా చేస్తున్న మీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహిణులు, ఉద్యోగస్తులు తమ కుటుంబం పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగులుతారు. ప్రతికూల పనులు చేసే వ్యక్తులు మిమ్మల్ని విమర్శిస్తారు. ఆర్థిక పరిస్థితిలో కొంత హడావిడి ఉండొచ్చు. వ్యాపార వ్యవస్థలో మెరుగుదల ఉంటుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

512
telugu astrology

సింహ రాశి:

ఈరోజు గ్రహ స్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రతిభను గుర్తించి, మీ దినచర్య, పని దినచర్యను పూర్తి శక్తితో నిర్వహించాలి. ఇంట్లో సన్నిహిత వ్యక్తుల ఉనికి ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ సాధారణ స్వభావాన్ని కొందరు వ్యక్తులు తప్పుగా ఉపయోగించుకోవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం కొన్ని లాభదాయకమైన అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది.  మీ సమస్యలను పరిష్కరించడంలో జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది.
 

612
telugu astrology

కన్య:

ఈ సమయంలో ఆస్తి లేదా ఏవైనా ఆగిపోయిన పనులు రాజకీయ నాయకుల సహాయంతో పూర్తి అవుతుంది. మీ సామాజిక సరిహద్దులు కూడా పెరుగుతాయి. సమాజానికి సంబంధించిన ఏదైనా వివాదం మీకు అనుకూలంగా రావొచ్చు. మీ వ్యక్తిగత కార్యకలాపాల్లో బయటి వ్యక్తులను జోక్యం చేసుకోనివ్వకండి. ఏదైనా ప్రణాళిక వేసే ముందు మరోసారి ఆలోచించుకోవాలి. మీ స్వంత పనిలో తరచుగా ఆటంకాలు ఏర్పడటం వల్ల మీరు సోమరితనంగా, అజాగ్రత్తగా ఉంటారు. 

712
telugu astrology

తుల:

తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ సమయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. శ్రేయోభిలాషి సహాయంతో మీ కోరికలు నెరవేరుతాయి. తొందరపాటుతో, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించబడుతుంది. ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులకు చెప్పండి. చిన్న విషయాలకే ఒత్తిడికి గురికావొద్దు. వ్యాపారం, ఉద్యోగ రంగాలలో కొన్ని రకాల రాజకీయాలను ఎదుర్కోవలసి రావొచ్చు.
 

812
telugu astrology

వృశ్చికం:

ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి. కానీ మీ తెలివితేటలతో సమస్యను పరిష్కరిస్తారు. దగ్గరి బంధువులతో కొంత సమయం గడపడం వల్ల ఒకరితో ఒకరికి అనుబంధం బలపడుతుంది. ఇతరుల ఆస్తిలో జోక్యం చేసుకోకండి. మహిళలు అత్తమామతో గొడవపడతారు. పిల్లల మొండితనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు ప్రారంభంలో కొన్ని వ్యాపార సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. 
 

912
telugu astrology


ధనుస్సు:

ఈరోజు మీరు రిలాక్స్డ్ మూడ్‌లో ఉంటారు. సన్నిహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు చేయడం వల్ల మనసులో ఆనందం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడతాయి. ఓర్పుతో, విజ్ఞతతో సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. వ్యాపార దృక్కోణం నుంచి సమయం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి.
 

1012
telugu astrology

మకరం:

ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి బాగుంటుంది. మీరు కొంతకాలంగా వెతుకుతున్న సౌఖ్యం మీకు లభించొచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హడావుడిగా తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించబడుతుంది. కొన్ని కలలు నెరవేరని కారణంగా మనస్సు కొద్దిగా నిరాశ చెందుతుంది. వ్యాపార కార్యకలాపాలు ఈరోజు మందకొడిగా సాగుతాయి. ఆడవాళ్లకు కీళ్ల నొప్పులు ఉంటాయి. 

1112
telugu astrology

కుంభ రాశి:

చాలా కాలంగా కలవరపెడుతున్న పనులు ఈరోజు మళ్లీ మొదలవుతాయి.  ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ మనస్సాక్షి మాట వినండి. మీరు ఖచ్చితంగా సరైన సలహా పొందుతారు. తోబుట్టువులతో సంబంధాలలో మాధుర్యాన్ని కొనసాగించండి. అలాగే పిల్లల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచండి. ఈరోజు ఎలాంటి ప్రయాణాలు చేయొద్దు. ఈ సమయంలో వ్యాపారం లాభాల్లో సాగుతుంది. 
 

1212
telugu astrology

మీనం:

తొందరపడి ఏ పనులూ చేయకండి. మీ ప్రతిభను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే మీకు విజయం దక్కుతుంది. మీ విశ్వాసం, సామర్థ్యం పెరుగుతుంది. ఏదో ఒక కారణంగా ఇంట్లో వాతావరణం చెడిపోతుంది. అవసరమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు ఏర్పడొచ్చు. ఈరోజు మీరు కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా శారీరక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories