Ketu Sancharam: కేతు గ్రహం దుష్ట గ్రహమే అయినా కొన్నిసార్లు శుభ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో కలిసి వస్తుంది. కేతువు రాశి మార్చుకోవడం వల్ల 2026లో భీబత్సంగా ఆర్దికంగా కలిసివస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారాలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. 2026 సంవత్సరంలో ముఖ్యంగా కేతు గ్రహం చేసే గోచారం విపరీతంగా కలిసివస్తుంది. ప్రస్తుతం సింహ రాశిలో ఉన్న కేతు, 2026లో కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ఈ గోచారం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి కేతు గోచారం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
25
కేతు గ్రహం అనుకూలంగా ఉంటే
కేతు గ్రహాన్ని సాధారణంగా ఛాయా గ్రహంగా చెప్పుకుంంటారు. కేతు గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు అనుకోని లాభాలు, సమస్యల నుంచి విముక్తి, మనసుకు శాంతి లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. 2026లో కేతు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల జీవితాల్లో మంచి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
35
తులా రాశి
జ్యోతిషశాస్త్రం ప్రకారం 2026లో కేతు గోచారం వల్ల లాభపడే ప్రధాన రాశి తులా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు రావచ్చు. ఆదాయం పెరగడం, కొత్త మార్గాల ద్వారా డబ్బు రావడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు లేదా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
ఇక కన్యా రాశి వారికి కూడా కేతు గోచారం శుభఫలితాలు ఇవ్వవచ్చని అంచనా. ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కెరీర్ విషయంలో మంచి మార్పులు రావచ్చు. కొత్త బాధ్యతలు, అవకాశాలు లభించవచ్చు. వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. మనసులో ఉన్న ఆందోళనలు తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
55
మకర రాశి
మకర రాశి వారికి కేతు గోచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు రావచ్చు. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత అవకాశాలు కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం అని సూచిస్తున్నారు.