అక్కడ పెళ్లి కూతురికి గిఫ్ట్ గా నల్ల పిల్లి ఇస్తారు తెలుసా..?

First Published Dec 4, 2021, 2:22 PM IST

ఎందుకలా అంటే.. నల్ల  పిల్లి అపశకునం గా భావిస్తారు. అయితే... ఇదే నల్ల పిల్లిని.. కొన్ని దేశాల్లో శుభ సూచికంగా భావిస్తారట. ఆ దేశాలేంటే.. వాళ్లు నల్ల పిల్లిని ఎలా భావిస్తారో ఇప్పుడు  చూద్దాం..

మన దేశంలో.. చాలా మంది కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. తుమ్మినప్పుడు ప్రయాణాలు చేయకూడదని అంటూ ఉంటారు. ముఖ్యంగా  ఎక్కడికైనా వెళ్తుంటే.. నల్ల పిల్లి ఎదురైందంటే.. ఇక ప్రయాణాలే రద్దు చేసుకుంటారు. ఎందుకలా అంటే.. నల్ల  పిల్లి అపశకునం గా భావిస్తారు. అయితే... ఇదే నల్ల పిల్లిని.. కొన్ని దేశాల్లో శుభ సూచికంగా భావిస్తారట. ఆ దేశాలేంటే.. వాళ్లు నల్ల పిల్లిని ఎలా భావిస్తారో ఇప్పుడు  చూద్దాం..

bride

1.యూకే..
యూకే లో నల్లపిల్లిని చాలా శుభం గా భావిస్తారు. పెళ్లి రోజున వధువుకు నల్ల పిల్లిని బహుమతిగా ఇవ్వడం అదృష్టాన్ని తెస్తుందని వారు నమ్ముతారట. కొత్తగా పెళ్లయిన వారి ఇంట్లో పిల్లి ఉంటే, అది చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. పిల్లి నలుపు రంగు అక్కడ అదృష్ట రంగుగా వారు భావిస్తారు.

2.జపాన్

జపాన్‌లో, నలుపు లేదా స్వచ్ఛమైన తెల్లని పిల్లులు తమ ఇళ్లకు శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. జపనీయుల ప్రకారం, నల్ల పిల్లులు చెడు  దూరం చేస్తాయని వారు నమ్ముతుంటారట.

3.ఫ్రాన్స్..
ఇక్కడ నల్ల పిల్లులను మాగోట్స్ అని పిలుస్తారు. ఫ్రాన్స్‌లోని మూఢ నమ్మకాల ప్రకారం, మీరు నల్ల పిల్లికి సరిగ్గా ఆహారం అందిస్తే... అది అదృష్టాన్ని తెస్తుంది.

4.స్కాట్లాండ్..
తెలియని పిల్లి, నలుపు లేదా ఏదైనా రంగు మీ ఇంట్లోకి ప్రవేశిస్తే, సంపద త్వరలో మీ తలుపు తడుతుందని  స్కాటిష్ ప్రజలు నమ్ముతూ ఉంటారట
 

5.నార్వే..
నల్ల పిల్లులు ప్రేమకు చిహ్నాలు . అవి సంతానోత్పత్తిని పెంచుతాయని నార్వేజియన్ పురాణాలు చెబుతున్నాయి. కారణం ఏమిటంటే, నల్ల పిల్లులు ప్రేమ, సంతానోత్పత్తిని ఇస్తాయని వారు నమ్ముతుంటారట.

6. ఈజిప్ట్...

ఈజిప్టులో, నల్ల పిల్లులను దేవుళ్లలా పూజిస్తారు.  అంతేకాదు.. ఆ పిల్లలు ఇంట్లో ఉుంటే.. ఆనందంగా, కుటుంబసభ్యులతో ఆప్యాయంగా  ఉంటామని.. తెలివి పెరుగుతుందని భావిస్తుంటారట.  నిజానికి ఆ కుటుంబంలో ఒక నల్ల పిల్లి చనిపోతే ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుందట.

click me!