ఏ బంధమైనా అందంగా, ఆనందంగా ఉండాలి అంటే... వారి మధ్య నమ్మకం, విశ్వాసం, విధేయతలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లేని బంధం ఎక్కువ కాలం నిలవదు. ఒక సంబంధాన్ని విచ్చిన్నం చేయడానికి ద్రోహం అనే చిన్న పదం చాలు. అందుకే.. మన చుట్టూ ఉన్నవారు.. నిత్యం మనతో విశ్వాసంగా.. మనకు ఎలాంటి ద్రోహం చేయకుండా ఉండేవారిని ఎంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటివారు ఎవరు అనేది.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. జీవితంలో ఎవరికీ ద్రోహం చేయకుండా.. నిజాయితీగా ఉండే రాశులు ఎవరో ఇప్పుడు చూద్దాం..