Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే

Published : Feb 08, 2026, 08:20 AM IST

Name Astrology: మనిషి పేరును బట్టి వారి వ్యక్తిత్వం ఉంటుంది అనే విషయం నేమ్ ఆస్ట్రాలజీ చెబుతోంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం పేరులోని మొదటి అక్షరం కొంతవరకు జీవితంపై స్వభావాన్ని చూపిస్తుంది. A అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
A అక్షరంతో పేరు పెట్టుకుంటే

ఆంగ్ల అక్షరమాలలో A మొదటి అక్షరం కావడం వల్ల అది సంఖ్యలలో మొదటిది అయిన 1తో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. పేరులోని మొదటి అక్షరం కెరీర్ పైనా, జీవితం పైనా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఆంగ్ల అక్షరం A తో మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, వారికి ఎలాంటి ఉద్యోగాలు కలిసి వస్తాయో తెలుసుకోండి. A అనే అక్షరం నెంబర్ వన్ తో ప్రతిధ్వనిస్తుంది. A అనేది వర్ణమాలలోని మొదటి అక్షరం.. అయితే ఇది 1వ సంఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది. మొదటి వ్యక్తి కావడంతో వీరు శక్తిమంతులుగా, చురుకుగా ఉండడానికి ఇష్టపడతారు. ఏ పరిస్థితుల్లోనైనా వీరు ముందుకు సాగేందుకే ఇష్టపడతారు.

24
రిస్క్ తీసుకుంటారు

ప్రపంచాన్ని కదిలించే వ్యక్తిగా వీరు మారగలరు. ఏ సంస్థనైనా స్థాపించే శక్తి వీరికి ఉంది. బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతారు. సొంత నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగుతారు. అందుకు కావలసిన ఆత్మవిశ్వాసం, నిశ్చయం, ధైర్యం అన్ని వీరిలో ఉంటాయి. దాదాపు అన్ని సమయాలలో వీరు ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతారు. వీరు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. చురుగ్గా ఉండేందుకు ఇష్టపడతారు. వినోదం, సాహసం ఉన్నచోట కచ్చితంగా వీరు ఉంటారు. ఆ పనులు చేసేందుకు ఎల్లప్పుడూ ముందుకే సాగుతారు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడం కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం నిత్యం చేస్తూ ఉంటారు.

34
ఎలాంటి ఉద్యోగాలు చేయాలి?

మీరు మంచి మార్గదర్శకులుగా మారుతారు. ఇతరులను ముందుకు నడిపించేందుకు, మార్గం చూపించేందుకు ఉత్తమంగా పనిచేస్తారు. కాబట్టి అలా నాయకత్వాన్ని అందించే ఉద్యోగాలు వీరికి సరైనవి. ఒక సంస్థను స్థాపించడం లేదా ఉపాధ్యాయుడుగా మారడం, పరిశోధనలు చేయడం లాంటి వాటిలో వీరు బాగా రాణిస్తారు. వ్యాపారం చేయడంలో కూడా వీరు దిట్టగానే చెప్పుకోవాలి. ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా కచ్చితంగా దాన్ని విజయవంతం చేస్తారు.

44
బలహీనతలు ఇవే

ప్రతి వ్యక్తికి బలాలు మాత్రమే కాదు... కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు A అక్షరంతో మొదలయ్యే పేర్లుగల వారు అతి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇది కొన్నిసార్లు వారికి చెడు చేసే అవకాశం ఉంది. తమ ఆలోచనే సరైనదని ఇతరులు ఇచ్చిన అభిప్రాయాలను, సలహాలను పట్టించుకోకపోవడం వల్ల నష్టం జరగవచ్చు. త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉత్సాహంతో ఇతరుల కష్టాన్ని తక్కువ అంచనా వేస్తారు. వీరు బయటికి చాలా ధైర్యంగా కనిపిస్తారు.. కానీ మనసులో ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories