Horoscope: ఈ రాశి వారు ప‌క్క‌వారి విష‌యంలో త‌ల‌ దూర్చితే క‌ష్టాలు త‌ప్ప‌వు.. వ‌చ్చే వారం జాగ్ర‌త్త‌గా ఉండాలి

Published : Feb 08, 2026, 07:16 AM IST

Horoscope: ఫిబ్ర‌వ‌రి నెల‌లో రెండో వారంలోకి ఎంట‌ర్ అయ్యాం. ఈ నేప‌థ్యంలో ఈ వారమంతా కుంభ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత ల‌క్ష్యాల‌పై దృష్టి పెట్ట‌డం మంచిద‌ని అంటున్నారు. 

PREV
15
వృత్తి, ఉద్యోగ పరిస్థితులు

కుంభ రాశి వారికి ఈ వారం మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ వారం ఉద్యోగ రంగంలో బాధ్యతలు కొంచెం పెరుగుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఎదురైనా, సహనం పాటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం కాకుండా పూర్తి చేస్తే పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా సొంత లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిద‌ని సూచిస్తున్నారు.

25
ఆర్థిక పరిస్థితి, ఆస్తి విషయాలు

ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒక ఆస్తి సంబంధిత సమస్య పరిష్కార దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి. అవసర సమయంలో డబ్బు అందక కొంత ఇబ్బంది ఎదురవొచ్చు. అప్పుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

35
వ్యాపారం, విద్య, ప్రయత్నాలు

వ్యాపారాలు పెద్ద లాభాలు ఇవ్వకపోయినా సాధారణంగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ఈ వారం కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. శ్రమ పెరిగినా ఫలితం మాత్రం ఆలస్యంగా లభిస్తుంది. ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలి.

45
కుటుంబ జీవితం, సంబంధాలు

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. కొందరు బంధువులతో మ‌న‌స్ఫ‌ర్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాటతీరులో నియంత్రణ పాటిస్తే సమస్యలు దూరంగా ఉండొచ్చు. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

55
ఆరోగ్యం, అదృష్ట సూచనలు, పరిహారాలు

ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. చిన్న చిన్న అలసటలు తప్ప పెద్ద సమస్యలు ఉండవు. అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7, 9, 13. మానసిక ప్రశాంతత కోసం నవగ్రహ ధ్యానం చేయడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories