తుల రాశి...
తుల రాశివారు శాంతి, సమతుల్యతను ఇష్టపడే మనసు కలిగి ఉంటారు. వీరు ప్రేమించిన వారితో ఎలాంటి గొడవలు, సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని వీరు అనుకుంటారు. కానీ, ఏవైనా సమస్యలు వస్తే మాత్రం వీరు తట్టుకోలేరు. ఆ బంధం నుంచి దూరంగా పారిపోవాలని అనుకుంటారు. వీరు బంధం కంటే మనశ్శాంతిని ఎక్కువగా కోరుకుంటారు. సంబంధంలో శాంతి లేనప్పుడు.. వారు ఆ సంబంధాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. అలాంటి వారితో కలిసి ఉండటం కంటే.. దూరంగా ఉండటమే మంచిది అని వీరు భావిస్తారు.వీరికి గొడవలు, వాటి వల్ల వచ్చే ఒత్తిడి ఏ మాత్రం నచ్చదు.