Zodiac signs: ఈ రాశులవారు వజ్రం ధరిస్తే.. ఆర్థిక నష్టం గ్యారెంటీ

Published : Nov 14, 2025, 05:14 PM IST

Zodiac signs: ఆభరణాలలో వజ్రానికి విలువ ఎక్కువ అని చెప్పొచ్చు. చాలా మంది డైమండ్స్ వేసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ, ఈ వజ్రాలు అందరికీ శుభాన్ని తీసుకురావు. కొందరు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

PREV
16
zodiac signs

జోతిష్యంలో ప్రతి రత్నానికి ఒక ప్రత్యేక గ్రహాధిపత్యం ఉంటుంది. వజ్రాన్ని శుక్ర గ్రహాన్ని సూచించే రత్నంగా పరిగణిస్తారు. శుక్రుడు ప్రేమ, విలాసం, ఐశ్వర్యం, కళ, సంబంధాలు వంటి అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అయితే, ప్రతి రాశికీ శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వడు. అందువల్ల అందరూ వజ్రాన్ని ధరించడం మంచిది కాదు. అందుకే, ఏ రాశివారు డైమండ్స్ ధరించడకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. శుక్రుడు ప్రతిఫలంగా ఉన్నవారు వజ్రం ధరించగానే, వారి జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు పెరగవచ్చు. మరి, ఏ రాశులవారు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....

26
మేష రాశి...

మేష రాశిని కుజుడు పాలిస్తూ ఉంటాడు. కేజుడు అగ్నితత్వాన్ని సూచిస్తాడు. శుక్రుడు సుఖాలను సూచిస్తాడు. ఈ రెండు గ్రహాలు పరస్పరం శత్రువులు. అందువల్ల మేష రాశివారు వజ్రం ధరించడం వలన గ్రహసంబంధ ఘర్షణలు ఏర్పడి ఆర్థిక సమస్యలు, కోపం పెరగడం, ఆరోగ్య సమస్యలు, అనవసర ఖర్చులు వంటి ఇబ్బందులు వస్తాయి. కెరీర్ లో కూడా సమస్యలు వస్తాయి. అందుకే, వీరు డైమండ్స్ కి దూరంగా ఉండాలి.

36
కర్కాటక రాశి...

కర్కాటక రాశి పాలకుడు చంద్రుడు. చంద్రుడు మను, భావోద్వేగాలు, శాంతిని సూచిస్తాడు. శుక్రుడు చంద్రుని కలయిక కొంత మందికి మంచిదైనా, చాలా మందికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశివారు వజ్రం ధరించినప్పుడు అదృష్టం తగ్గి, దురదృష్టం పెరుగుతుంది. ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాల్లో సమస్యలు వస్తాయి. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మాత్రమే నిపుణుల సలహాతో వజ్రం ధరించాలి.

46
సింహ రాశి...

సింహ రాశిని సూర్యుడు పాలిస్తూ ఉంటాడు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, అధికారాన్ని సూచిస్తాడు. శుక్రుడు సూర్యుడి శత్రువుల్లో ఒకడు. అందువల్ల, సింహ రాశివారు వజ్రం ధరించినప్పుడు గౌరవానికి హాని కలుగుతుంది. కెరీర్ లో వెనకపడిపోతారు. నిరాశ పెరిగిపోతుంది. ప్రతిష్ఠ తగ్గిపోతుంది. ఈ రాశివారు వజ్రం ధరిస్తే... సామాజిక స్థితి కూడా దెబ్బతింటుంది.

56
వృశ్చిక రాశి

వృశ్చిక రాశిని కుజుడు పాలిస్తాడు. మేష రాశి లాగానే వృశ్చిక రాశి వారికి కూడా శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వడు. వీరు డైమండ్స్ ధరించిన వెంటనే జీవితంలో అడ్డు, ఆటంకాలు పెరుగుతాయి. అర్ధాంతరంగా పనులు ఆగిపోతాయి. వ్యక్తిగత సంబంధాల్లో ఉద్రిక్తత, ఆరోగ్య సమస్యలు రావచ్చు. శుక్రుడు కుజుని అనుకూలంగా దృష్టిపెట్టినప్పుడు వజ్రం ప్రభావం మరింత ప్రతికూలంగా మారుతుంది.

66
మీన రాశి...

మీన రాశి పాలక గ్రహం గురుడు. గురు గ్రహం ఆధ్యాత్మికత, జ్ఞానం, ధర్మాన్ని సూచిస్తాడు. శుక్రుడు భోగాలు, విలాసాన్ని సూచిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండవు. అందువల్ల మీన రాశి వారు వజ్రం ధరించడం వలన ఆర్థిక నష్టం, అనుకోని ఖర్చులు, దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే, ఈ రాశివారు కూడా వజ్రం ధరించకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories