సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ వస్తూ వస్తూనే మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకురానుంది. కొత్త సంవత్సరంలో వస్తున్న మొట్ట మొదటి పండగ ఇది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు.ఇలా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలోనే శుక్రుడు మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడు. దీని కారణంగా శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనితో పాటు.. ధనుస్సు రాశిలో కుజుడు, బుధుడి కలయిక వల్ల బుదాధిత్య యోగం, వృద్ధి యోగం, రవి యోగం కూడా ఇదే రోజున ఏర్పడుతున్నాయి.ముఖ్యంగా, గురు, చంద్రుల స్థానం కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. వీటన్నింటి వల్ల ఐదు రాశుల జీవితాలు పూర్తిగా మారపోనున్నాయి. ముఖ్యంగా ధనవంతులు కానున్నారు. ఆ రాశులేంటో చూద్దాం..