జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. అయితే, కొన్ని రాశులవారికి మాత్రం తెలివి తేటలు చాలా ఎక్కువ. వీరికి పుట్టుకతోనే IQ చాలా ఎక్కువ. వీరు నిశ్శబ్దంగా ఉంటూనే.. అవసరమైనప్పుడు మాత్రమే తమ మేధస్సు ప్రదర్శిస్తారు. ఇతరులు ఎవరూ చేయలేని పనిని వారు చాలా ఈజీగా చేయగలరు. అందరి ముందు చాలా స్పెషల్ గా గుర్తింపు సాధించగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
25
1.కన్య రాశి...
కన్య రాశిపై బుధుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి విజ్ఞానం పెంచుకోవడంపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం, ఏదైనా సమస్యను పరిష్కరించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు తెలుసుకున్న విషయాన్ని అంత తొందరగా మర్చిపోరు. వీరికి IQ చాలా ఎక్కువ. సాధారణ విషయాలను కూడా చాలా లోతుగా పరిశీలించగల శక్తి వీరికి ఉంటుంది
35
2.మిథున రాశి...
మిథున రాశి ని బుధ గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఒకే విషయాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. చాలా తొందరగా ఏదైనా విషయాన్ని నేర్చుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్, విశ్లేషణాత్మక దృష్టికోణం వీరి IQని మరింత పెంచుతాయి.
ధనస్సు రాశి ని గురు గ్రహం పాలిస్తూ ఉంటుంది. వీరికి కూడా IQ చాలా ఎక్కువ. సాంప్రదాయాలను ప్రశ్నిస్తూ, కొత్త దారులను అన్వేషించే ధైర్యం వీరిలో ఉంటుంది. జీవితానుభావాల నుంచి వీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు.
55
4. మీన రాశి (Pisces):
ఇది కొందరికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కాని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఈ రాశిలోనే జన్మించారు. ఈ రాశివారు ఊహాశక్తి, సృజనాత్మకత, లోతైన ఆలోచనలతో వెలుగులోకి వస్తారు. పరిశోధనలు, క్షుణ్ణ విశ్లేషణలతో ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
గమనిక...
ఈ వ్యాసంలోని వివరాలు జ్యోతిషశాస్త్ర నమ్మకాలకు ఆధారంగా ఉన్నాయి. రాశుల ప్రభావం వ్యక్తుల వ్యక్తిత్వంపై ఉండొచ్చు కానీ, ప్రతి ఒక్కరి మేధస్సు, విజ్ఞానం జీవనపరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. జ్యోతిష పరంగా రత్నాలు ధరించాలనుకుంటే, అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుని సంప్రదించడం మంచిది.