వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వీరు ఈ రోజు విలువైన వాహనాలను, వస్తువులను కొంటారు. ఆస్థికి సంబంధించన విషయాల్లో శుభవార్తలు వింటారు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబానికి డబ్బు విషయంలో ఏ లోటూ ఉండదు.
ఉద్యోగం, వ్యాపారం
ఉద్యోగులకు ఈ రోజు బాగా గడుస్తుంది. వీరు తమ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ ప్రతిభ అందరికీ తెలుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. పరీక్ష, ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను పొందుతారు. అధికారుల మద్దతు పొందుతారు. ఈ రోజు వ్యాపారవేత్తలకు లాభాదాయకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఒప్పందాలు కుదరడంతో మనసంతా ఆనందంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంది.