Kubera Blessings: కుబేరుడు ఈ రాశులకు ఎప్పుడూ అండగా ఉంటాడు.. డబ్బుకు లోటే రాదు..!

Published : Jun 09, 2026, 07:24 AM IST

 Kubera Blessings: లక్ష్మీదేవిని పూజిస్తే.. సంపదకు లోటు ఉండదు అనుకుంటాం. అయితే.. లక్ష్మీ దేవతతో పాటు.. కుబేరుడు కూడా సంపదకు అధిపతే. అందుకే.. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాదు..కుబేరుడిని కూడా పూజించాలి.

PREV
14
Kubera Favourite Zodiac signs

జోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికీ కొన్ని గ్రహాలతో, దేవతలతో సంబంధం ఉంటుంది. కొన్ని రాశుల వారిపై లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటే.. కొన్ని రాశులవారిపై కుబేరుడి అనుగ్రహం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉన్న రాశులకు జీవితంలో డబ్బు కొరత ఎప్పుడూ రాదు. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా.. వారు కోరుకున్నప్పుడు చేతికి డబ్బు అందుతుంది. అంతేకాదు.. జీవితంలో చాలా తక్కువ సమయంలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

24
ధనుస్సు రాశి...

ధనుస్సు రాశి వారికి కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అందుకే, ఈ రాశివారికి డబ్బులోటు అనేది ఎప్పుడూ ఉండదు. వీరు చాలా చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు. అంతేకాదు.. ఈ రాశివారు సహజంగానే కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ఎక్కడ పనిచేసినా చాలా నమ్మకంగా ఉంటారు.కుబేరుడి ఆశీస్సులతో వారికి అన్ని సుఖాలు లభిస్తాయి. ఏ లోటూ ఉండదు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను చాలా సులభంగా అధిగమిస్తారు. అంతేకాదు.. ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు.

34
వృషభ రాశి..

వృషభ రాశి వారిపై కూడా కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి.కుబేరుడి ఆశీర్వాదం కారణంగా వీరు కోరుకున్న సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరికి లోటు ఎప్పుడూ రాదు. వీరు తొందరగా జీవితంలో స్థిరపడతారు. డబ్బు ఎక్కువగా పొదుపు చేస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ వీరిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. చాలా తక్కువ సమయంలో వీరు మంచి హోదాను సాధిస్తారు.

44
తుల రాశి...

జోతిష్యశాస్త్రంలోని 12 రాశుల్లో కెల్లా తుల రాశివారి చాలా అదృష్ట రాశి. వీరికి జీవితంలో డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు. కుబేరుడు ఆశీస్సులు వీరిపై పుష్కలంగా ఉంటాయి. వీరి చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటూనే ఉంటుంది. డబ్బు సంపాదించడానికి సహాయపడే ఏ చిన్న మార్గాన్ని కూడా వీరు వదులుకోరు.

Read more Photos on
click me!

Recommended Stories