Sun Movements: ఒకేనెలలో మూడుసార్లు సూర్యుడి రాశి మార్పు, ఈ 3 రాశులకు ఎంత అదృష్టమో

Published : Jan 19, 2026, 06:40 AM IST

Sun Movements: సూర్యుడు గ్రహాలలో ముఖ్యమైనవాడు.  ఫిబ్రవరి నెలలో మూడుసార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి అదృష్టం పడుతుంది. ఆ రాశుల గురించి తెలుసుకోండి. 

PREV
14
సూర్య సంచారం

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడు కదలికలు 12 రాశుల పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశులకు అదృష్టం పడుతుంది. సూర్యుడు ఫిబ్రవరిలో మూడు సార్లు రాశిని మార్చుకోబోతున్నాడు.  ఫిబ్రవరి 6న ధనిష్ఠ, 13న కుంభరాశిలో, 19న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మంచి మార్పులు జీవితంలో జరగనున్నాయి. ఆ రాశులేవో తెలుసుకోండి. 

24
మేష రాశి

ఫిబ్రవరిలో జరిగే సూర్యుని సంచారం మేషరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఉద్యోగం చేస్తున్నా,  వ్యాపారం చేస్తున్నా బాగా కలిసి వస్తుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడి ఆర్థికంగా బాగా బలపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలు కూడా వస్తాయి.  జీవిత భాగస్వామితో వీరి బంధం బలపడి సంతోషంగా జీవిస్తారు.

34
సింహ రాశి

సూర్యుడు రాశి, నక్షత్ర మార్పులు అనేవి సింహరాశి వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు తెస్తుంది. ఫిబ్రవరి నుంచి  వీరి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.  జీవితంలో ప్రేమ, అనుబంధం బాగుంటుంది. వీరు కొత్త ఆస్తులు కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ కల నెరవేరుతుంది. అలాగే చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు.  బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది.

44
ధనుస్సు రాశి

సూర్య సంచారం ధనుస్సు రాశికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. లేదా వ్యాపారంలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎప్పట్నించో చేయాలనుకుంటున్న విదేశీ ప్రయాణాన్ని చేసే అవకాశాలున్నాయి. వీరికి ఉన్న డబ్బు కష్టాల నుంచి బయటపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories