1.వృషభ రాశి..
సూర్యునిపై రాహువు ప్రభావం కారణంగా... వృషభ రాశివారు ఈ నెల రోజులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఆత్మవిశ్వాసం , ధైర్యం కోల్పోయే అవకాశం ఉంది. వారు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ వారికి సందేహాలు ఉంటాయి. కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తారు. విద్యార్థులకు పరీక్షలు, ఉద్యోగాల గురించి ఆందోళన ఉంటుంది. వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి.. లాభాలు తగ్గుతాయి.