Zodiac signs: అబ్బాయిలూ.. ఈ 5 రాశుల అమ్మాయిల జోలికి అసలు వెళ్లొద్దు!

First Published | Jul 21, 2024, 8:00 AM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల పేర్లు, పుట్టిన తేదీ, రాశుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. రాశుల ఆధారంగా మనస్తత్వాన్ని పూర్తిగా అంచనా వేయడం కష్టమే.. అయినప్పటికీ కొన్ని రాశులు గణనీయంగా ఎక్కువ సవాళ్లు సృష్టించవచ్చు. ఇది ఆయా రాశుల వారి వ్యక్తిగత పరిస్థితులు, జీవిత అనుభవాల ఆధారంగా మారవచ్చు. అయితే, కొన్ని రాశుల అమ్మాయిలు కఠినమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలా ఏయే రాశులవారు ఉంటారో తెలుసుకుందామా...

1. వృశ్చికం రాశి (Scorpio)

వృశ్చిక రాశి అమ్మాయిలు చాలా సీరియస్‌గా ఉంటారు. పద్ధతులు, భావోద్వేగాలకు వీరు ప్రసిద్ధి. కాన్ఫిడెన్స్‌గా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అబద్ధాలు, అవినీతికి అస్సలు సహించరు. ఎందుకంటే.. వృశ్చిక రాశి అమ్మాయిలు లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. అవి అర్థంగా కానప్పుడు చాలా కఠినంగా మారిపోతుంటారు.

2. సింహ రాశి (Leo)

సింహ రాశి అమ్మాయిలు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌, బాగా సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. నాయకత్వాన్ని కోరుకుంటారు. కొన్నికొన్ని సమయాల్లో చాలా స్ట్రాంగ్‌గా, కటువుగా ఉంటారు. మితిమీరిన గర్వం, అవమానాన్ని తట్టుకోలేకపోవడం ఈ రాశి అమ్మాయిలు కఠినత్వానికి కారణం. 


3. కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశి అమ్మాయిలు సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వారు సులభంగా బాధపడతారు. వీరిని సరిగా అర్థం చేసుకోకపోతే కఠినంగా మారే అవకాశం ఉంది. ఎమోషనల్ సెన్సిటివిటీ, ప్రొటెక్టివ్‌ నేచర్‌ కారణంగా ఈ రాశి అమ్మాయిలు తీవ్రమైన పరిస్థితుల్లో కఠినంగా మారిపోతారు.

4. కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి అమ్మాయిలు స్వతంత్రత, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ విలువను ఇస్తారు. సమాజంతో లేదా పద్ధతులతో వీరు విభేదిస్తుంటారు. భావోద్వేగాలకు వీరు అస్సలు కంట్రోల్‌ చేసుకోలేరు. 

5. కన్య రాశి (Virgo)

కన్య రాశి అమ్మాయిలు విశ్లేషణాత్మకంగా ఉంటారు. కంప్లీట్‌నెస్‌ కోరుకుంటారు. ఈ క్రమంలో ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు. ఎదుటి వారి నుంచి అధిక ప్రతికూలతలు ఎదురైనప్పుడు అసహనంగా వ్యవహరిస్తారు.

Latest Videos

click me!