Kuja Transit: మారిన కుజ గ్రహం దిశ.. ఈ 4 రాశుల వారికి చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో అదృష్టం

Published : Jul 05, 2026, 09:08 AM IST

Kuja Transit: గ్రహాలలో కుజ గ్రహం ఎంతో ముఖ్యమైనది. కష్టాలను సుఖాలను ఇచ్చేది ఆయనే. జూలై 2వ తేదీ ఉదయం కుజుడు తన దిశను మార్చుకోబోతున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.

PREV
14
వృషభ రాశి

కుజుడు దిశ మార్చుకొని సంచారం చేయడం వల్ల వృషభ రాశి వారికి శుభ సమయం మొదలవుతుంది. వీరిలో తమపై తమకు విశ్వాసం పెరుగుతుంది. చేస్తున్న ఉద్యోగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు వచ్చి పడతాయి. వీరి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. ఇన్నాళ్లు పూర్తిగా పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు మళ్లీ మొదలవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.

24
మిథునం

కుజుడి గమనం మారడం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు చేస్తున్న ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. లేదా ఉన్నత స్థానాన్ని దక్కించుకుంటారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. ఇక భూమి కొనుగోలు చేయగలనుకుంటే దానిపైన కూడా ఇంట్లో చర్చలు జరుగుతాయి. కాకపోతే శారీరకంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాలి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.

34
వృశ్చిక రాశి

కుజ గ్రహ సంచారం అనేది వృశ్చిక రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారు శారీరకంగా బలంగా మారుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్టు లభిస్తుంది. వీరికి కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎప్పటినుంచో బాధ పెడుతున్న పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.

44
ధనుస్సు రాశి

కుజ గ్రహ సంచారం అనేది ధనుస్సు రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం బలంగా మారుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాలలో వీరికి అనుకూలమైన మార్పులు కలుగుతాయి. ఆకస్మికంగా ఆర్థికంగా లాభాలు వచ్చి పడవచ్చు. ఇతరుల చేతుల్లో నిలిచిపోయిన మీ డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు కూడా కొత్తగా తీర్చుకుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories