Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి!

Published : Jul 05, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 05.07.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

413
మిథున రాశి ఫలాలు

ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు పనిభారం నుంచి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవసరానికి చేతిలో తగినంత డబ్బు ఉండదు. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

1313
మీన రాశి ఫలాలు

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories