Five Rajayogas: కుంభరాశిలో ఒకేసారి 5 రాజయోగాలు, ఈ 5 రాశుల వారు ఎంత అదృష్టవంతులంటే..

Published : Jan 23, 2026, 07:35 AM IST

Five Rajayogas: ఫిబ్రవరి 2026లో గ్రహాల సంచారం వల్ల అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. శని రాశి అయిన కుంభరాశిలో అనేక గ్రహాలు కలవబోతున్నాయి. దీనివల్ల ఒకటి రెండు కాదు, ఏకంగా ఐదు రాజయోగాలు ఏర్పడతాయి. 

PREV
16
ఫిబ్రవరి జాతకం

వచ్చేనెల ఫిబ్రవరిలో అయిదు యోగాలు ఒకేసారి కుంభరాశిలో ఏర్పడబోతున్నాయి. వీటివల్ల కొన్ని రాశుల వారికి భారీగా కలిసివస్తుంది. ఫిబ్రవరి 3, 2026న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించి రాహువుతో కలుస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 6న శుక్రుడు, ఫిబ్రవరి 13న సూర్యుడు, ఫిబ్రవరి 23న అంగారకుడు కుంభరాశిలోకి అడుగుపెడతారు.  దీనివల్ల లక్ష్మీ నారాయణ, శుక్రాదిత్య, ఆదిత్య మంగళ, బుధాదిత్య, చతుర్గ్రాహి యోగాలు ఏర్పడతాయి. కుంభ రాశిలోనే ఈ అయిదు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ అయిదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

26
మేష రాశి

ఫిబ్రవరి 2026 మేషరాశి వారికి బాగా కలిసొచ్చే శుభ నెల. వీరికి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ఈ నెలలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఖర్చులు ఉన్నా కూడా వాటిని భరించగలిగే స్థాయికి ఎదుగుతారు. వ్యాపారులకు  ఫిబ్రవరి నెల ఎంతో ఫలప్రదమైనది. వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. మంగళవారం దానిమ్మ పండ్లు దానం చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. 

36
వృషభ రాశి

వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల నుంచి మంచి కాలం మొదలవుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 17 నుంచి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. ఈ నెలలోనే ఉద్యోగం మారే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేస్తారు. శనివారం వికలాంగులకు ఆహారం దానం చేయడం ఎంతో మంచిది.

46
మిథున రాశి

మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల కలిసొస్తుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లోని పరిస్థితులన్నీ మళ్లీ చక్కబడతాయి. ఒత్తిడి తగ్గి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంతో  కలిసి లేదా భాగస్వామితో కలిసి సంతోషకరమైన ప్రయాణం చేస్తారు. ఫిబ్రవరిలో ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి మార్గం.

56
కన్యా రాశి

కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల మంచి పురోగతిని, ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది. ఫిబ్రవరి నెలలో వ్యాపారుల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో చేసే  ప్రయత్నాలు  దాదాపు సఫలమవుతాయి. ఇక ఉద్యోగులకు ఇదే మంచి సమయం. అన్ని రకాలుగా వారికి కార్యాలయంలో కలిసివస్తుంది. భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ఇంట్లో సంతోషం నెలకొంటుంది.

66
కుంభరాశి

ఫిబ్రవరిలో అయిదు యోగాలు ఏర్పడేది కుంభరాశిలోనే. దీని వల్ల ఆ రాశి వారికి కూడా అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఫిబ్రవరి అనుకూలమైన నెల. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఇది బాగా కలిసొచ్చే సమయం. రాజకీయ సంబంధాలు లాభాలను తెచ్చిపెడతాయి.  వీరికి ఆర్థిక లాభాలు, పనిలో విజయం ఉంటాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా సాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories