మన జీవితం మనం తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. కొందరు.. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. ఇతరుల సలహాలు తీసుకుంటారు. ఆలోచించకుండా ఒక్క నిర్ణయం కూడా తీసుకోరు. మనకు వచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి అన్నీ తూకం వేసుకుంటారు. కానీ.. మరి కొందరు ఉంటారు.. ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ముందు ఒక్క సెకన్ కూడా ఆలోచించరు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఏదైనా సమస్యల్లో పడుతుందా ఇలాంటివి ఏమీ ఆలోచించరు. అది ఎంత ముఖ్యమైన విషయం అయినా ఆవేశంగా నిర్ణయం తీసేసుకుంటారు.
పెళ్లి, విడాకులు, ఉద్యోగం, కొత్త కెరీర్ ప్రారంభించడం వంటి జీవితాన్ని మార్చే నిర్ణయాలను ఎవరైనా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. కానీ, వీరు ఇలాంటి విషయాలను చాలా లైట్ తీసుకుంటారు. వెంటనే డెసిషన్ తీసుకుంటారు. ఇలా తొందరపడి తీసుకున్న నిర్ణయాలకు జీవితాంతం తర్వాత బాధపడతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..