Sun Ketu Yogam: 18 ఏళ్ల తర్వాత సూర్య కేతు సంసప్తక యోగం ఈ 3 రాశులకు విపరీత ప్రయోజనాలు

Published : Feb 19, 2026, 04:39 PM IST

Sun Ketu Yogam: 18 ఏళ్ల తర్వాత సూర్యుడు, కేతువుతో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.  మార్చి నెలలో సూర్యుడు తన స్థానాన్ని మార్చుకుని ఈ అరుదైన యోగాన్ని ఏర్పరుస్తాడే. ఇది 3 రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

PREV
14
సూర్య కేతు సంయోగం

గ్రహాలకు రాజు సూర్యుడు.  మార్చి 15, 2026 ఉదయం 1:08 గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 14, 2026 ఉదయం 9:38 వరకు అక్కడే ఉంటాడు. అంటే నెల రోజుల పాటూ అక్కడే ఉంటాడు. అప్పుడే కేతువుతో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తాడు. రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడవ ఇంట్లో 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఇవి ఒకదానినొకటి పూర్తి దృష్టితో చూసుకున్నప్పుడు సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కేతువు కన్యారాశిలో, సూర్యుడు మీనరాశిలో ఉంటారు. ఈ అరుదైన యోగం 3 రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

24
కుంభ రాశి

కుంభ రాశి వారికి సూర్య, కేతువుల వల్ల ఏర్పడే సంసప్తక యోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిలో గురు గ్రహం కూడా అనుకూలంగా ఉండటంతో ఈ రాశి వారి నిర్ణయాధికారం పెరుగుతుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. సూర్యుడు ఈ రాశి వారికి రెండో ఇంట్లో ఉండటం వల్ల కొత్త స్నేహాలు కలుస్తాయి.  కెరీర్ పరంగా కూడా వీరికి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. 

34
తులా రాశి

తులా రాశి వారికి కూడా ఈ యోగం ఎంతో ఉపయోగం ఉంటుంది.  అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. ఈ రాశికి ఆరవ ఇంట్లో సూర్యుడు ఉంటాడు. దీనివల్ల ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కెరీర్ పరంగా నెల రోజుల సమయం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి  కొత్త ఉద్యోగం లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు కూడా కనిపిస్తాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

44
వృశ్చిక రాశి

సూర్యుడు, కేతువుల వల్ల ఈ యోగం వల్ల వృశ్చిక రాశి వారికి ఎంతో కలిసివస్తుంది. ఈ రాశి వారు వృత్తి రంగంలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారు ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. విజయం సాధించడంతో పాటు.. మంచి హోదా కూడా వస్తుంది. ఈ రాశివారి ఉద్యోగంలో ప్రమోషన్‌ పొందుతారు. అలాగే ఇంక్రిమెంట్ కూడా పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories